2024లో జనసేన గెలిచేది అన్ని సీట్లే.. పవన్ వ్యాఖ్యల అర్థం ఇదేనా..!
ఈ పరిణామం.. జనసేనలో ఉత్సాహాన్ని నింపింది. అయితే.. ఆవేశంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం ట్రోల్స్ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు గెలుచుకుం దని.. అయితే.. తాను పట్టుబడితే.. వచ్చే ఎన్నికల్లో `ఒకటి` ఎగిరిపోయి.. కేవలం 15 స్థానాలకే అది పరిమి తం అవుతుందని.. అప్పుడు.. తన తఢాఖా చూపిస్తానని చెప్పుకొచ్చారు. అదేసమయంలో అసెంబ్లీలో పాండవుల సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కౌరవుల సభ కొనసాగుతోందని.. దీనిని తాను మారుస్తానని వ్యాఖ్యలు చేశారు.
అయితే.. పవన్ చేసిన పాండవుల సభపై అప్పుడే.. సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 148 స్థానాల్లో పోటీ చేసింది. కొన్ని సీట్లను బీఎస్పీతో చేసుకున్న సర్దుబాటు.. మిత్రపక్షాలు.. కమ్యూనిస్టులకు కేటాయించిన నేపథ్యంలో పవన్ అక్కడితో సరిపెట్టుకున్నారు. అయితే.. కేవలం ఒకే స్థానంలో ఆయన నిలిచారు. తను ఓడినా.. తన పార్టీ తరఫున ఒక్కరిని గెలిపించుకున్నారు.
సరే.. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య 5కు చేరుతుందా పవన్...! అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఎందుకంటే.. పాండవులు.. అంటే ఐదుగురే కాబట్టి.. పాండవుల సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు కాబట్టి. వచ్చే ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుస్తారన్న మాట అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. మరి పవన్ ఇదే ఉద్దేశంతో అన్నారో.. లేక మరే ఉద్దేశంతో అన్నారో కానీ.. నెటిజన్లు మాత్రం ఇలానే అర్ధం చేసుకున్నారు.