ముహూర్తం ఖరారు


ముహూర్తం ఖరారు
ప్రత్యర్థి కోట నుంచే  ప్రచారం
ఎక్కడ పోగొట్టుకున్నామో... దానిని తిరిగి అక్కడ నుంచే పొందాలి అన్న నానుడిని కాంగ్రెస్  పార్టీ  అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారత దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల యద్దం లో దిగేందుకు  కాంగ్రెస్ పార్టీ  తన అస్త్రాలకు పదును పెడుతోంది.
భారత ప్రధాన మంత్రి నరేేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికలను  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తల్లో గెలుపు ఆశ కల్పించే నిమిత్తం వారణాశి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించ నుంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైన సోనియా గాంధీ కుమార్తే ప్రియాంక వద్రా భారీ ఎన్నికల ర్యాలీ లో ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎంపికలో నూ ఆ పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోేది.   ప్రస్తుతం లక్నో పర్యటనలో ఉన్న ప్రియాంక వద్రా సీనియర్ నేతలకు,  పార్టీ అబిమానులతో సమావేశమవుతున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానేే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. గెలుపు గుఱ్ఱాలను అన్వెషించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అంతే కాక ఈ ధఫా అభ్యర్థులు దాదాపుగా అరవై శాతం మంది కొత్త వారుంటారని, మహిళలకు సగానికి పైగా సీట్లు కేటాయిస్తారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన క్యాడర్ కు సంకేతాలిచ్చింది. యువతకు అధిక ప్రాధాన్యత  ఉంటుంది.  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు ముప్పై, నలభై ఏళ్ల లోపు  మధ్య వయస్కులై ఉండనున్నారు.
అక్టోబర్ 9 నుంచి అధికారిక ప్రచారం ఆరంభం కానుంది. నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ నిరాటంకంగా రోడ్ షోలు, బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తారు.
 అక్టోబర్ 10 నుంచి ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపే అభ్యర్దులు  వద్ద నుంచి దరఖాస్తులు  స్వీకరిస్తారు. ఈ ఎన్నికలలోకాంగ్రెస్ శ్రేణులు ఐకమత్యంతో ఎదుర్కోంటామని కాంగ్రెస్ నేతలు  చెప్పుకొచ్చారు.  ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో  జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నాయకులు గళం విప్పారు.  కాంగ్రెస్ పార్టీ సంస్కృుతిలో ఇది భాగమైనప్పటికి, దేశా రాజకీయలపై  నేతల నిరసన గళం ప్రభావాన్ని చూపింది.   పార్టీ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీలోని  సంస్థాగత వైఫల్యాలపై గళం విప్పారు.  పార్టీకి అధ్యక్షుడే లేడని, కీలక నిర్ణయాలు  ఎలా తీసుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నారని తెలిపారు. అంతే కాకుండా  పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా కపిల్ సిబాల్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: