వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం అనంతరం కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం 23 శాతానికి , మరణాల సంఖ్య 21 శాతానికి తగ్గిందని.... నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజాన్ని అణిచి వేయడం లో సఫలమవుతున్నామని వెల్లించారు అమిత్ షా. దశాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే తక్కువ మంది మృతి చెందారని... వామపక్ష తీవ్రవాద నిర్మూలన జరగకపోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రబలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును ప్రధాని తగ్గించారని గుర్తు చేశారు షా.
ఫలితంగా 2900 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్రాలకు తగ్గిపోయిందని.... ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య స్రవంతిలోకి వచ్చే మావోయుస్టులను ఆహ్వానిస్తూనే, అమాయక జనాన్ని, పోలీసులను చంపే వారికి అదే రీతిలో బుద్ధి చెప్తున్నామని ప్రకటించారు అమిత్ షా. గత ఆరు దశాబ్దాలలో అభివృద్ధి లేమి కారణంగానే వామపక్ష తీవ్రవాదానికి బీజం పడిందని... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు షా. సామాన్య ప్రజల అభివృద్ధికి అడ్డు పడకూడదని వామపక్ష తీవ్ర వాదులు సైతం భావిస్తున్నారు, అందుకే వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు అమిత్ షా.
వామపక్ష తీవ్రవాదం వల్ల గత 40 ఏళ్లలో 16 వేల మంది పౌరులు చనిపోయారని... ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటు బృందాలు సైతం లొంగి పోతున్నాయన్నారు అమిత్ షా.. వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు వారి ఆర్థిక వనరులను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమని... హింసాత్మక ఘటనలు 70శాతం తగ్గిపోయాయి, మృతుల సంఖ్య 82శాతానికి తగ్గిందని ప్రకటన చేశారు అమిత్ షా. ప్రస్తుతం 53 జిల్లాలలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉందని... వామపక్ష తీవ్రవాదులకు ఆర్థిక వనరులు అందకుండా రాష్ట్రాలు పరస్సర సహకారంతో గట్టి చర్యలు తీసుకోవాలని... త్వరలోనే వామపక్ష తీవ్ర వాదానికి చరమగీతం పాడే అవకాశం ఉందని కుండు బద్దలు కొట్టారు.