బిల్డప్ బాబాయ్ లా మారిన ఇమ్రాన్ ఖాన్.. ఇదే నిదర్శనం?

praveen
ప్రస్తుతం ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేశం పాకిస్థాన్ అని ప్రపంచ దేశాలకు తెలుసు   ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవి అక్కడి ప్రభుత్వమే అన్నది కూడా ప్రపంచం ఎరిగినదే. కానీ తమకు ఉగ్రవాదానికి అసలు సంబంధమే లేదని.. ఉగ్రవాదాన్ని అసలు సహించేది లేదు  అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అంతే కాదు ఓవైపు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకు పోతున్న అప్పటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బిల్డప్ లకు పోతుంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద బిల్డప్ బాబాయ్ లాగా మారిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.  ఇటీవలే ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లు ఆధిపత్యాన్ని చేపట్టి పాలన సాగిస్తున్నారు.

 ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ కూడా తాలిబన్లకు ప్రత్యక్షంగానే మద్దతు ప్రకటిస్తుంది.  తాలిబన్ల పాలనలో వచ్చినప్పటి నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ తో ప్రపంచ దేశాల సంబంధాలు సందిగ్ధంలో పడిపోయాయ్. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకు ఆహారధాన్యాల కొరత తీవ్రంగా అవుతుంది. దీంతో అక్కడి ప్రజలందరూ ఎంతగానో అల్లాడిపోతున్నారు.  ఇలాంటి సమయంలో ఇటీవలే సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉంది.

 ఇలాంటి సమయంలో మరోసారి పాకిస్థాన్ బిల్డప్ లకు  పోయింది. మింగ మెతుకు లేదు సంపంగి డోలు అనే విధంగా తమ దగ్గర తినడానికి సరైన ఆహార ధాన్యాల నిల్వ లేదు. అలాంటిది తామే స్వయంగా ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేస్తున్నాము అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.  ఈ క్రమంలోనే ఆప్ఘనిస్థాన్లో ప్రజల కోసం సౌదీ అరేబియా పంపిన ఆహారధాన్యాలను మళ్లీ ప్యాక్ చేసి ఇక పాకిస్థాన్ పేరును ముద్రించి మేమే సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఇక ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ బిల్డప్ లకి పోవడం తప్ప బుద్ధి మారదు  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: