కార్వీ పై కన్నేసిన ఈడీ...? అసలు ఫోకస్ ఎక్కడ...?

Sahithya
కార్వీ కార్యాలయంలో ఈడీ సోదాల స్పీడ్ పెంచింది. డీ మ్యాట్ అకౌంట్లు నుండి షేర్ లను బదాలించుకొని 350 కోట్లు బ్యాంక్ లను రుణాలనను కార్వీ తీసుకుందని అధికారులు గుర్తించారు. బ్యాంక్ ల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు బదలాయించింది కార్వీ యాజమాన్యం. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కార్వీ పై అభియోగాలు మోపారు. తెలంగాణా, కర్ణాటక , మహారాష్ట్ర, తమిళనాడు లో కార్వీ పై కేసులు నమోదు చేసిన అధికారులు ఆయా రాష్ట్రాల్లో కార్యాలయాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసారు.
నిధుల గోల్ మాల్ , కష్టమర్లు నగదు స్వాహా చేసిన కార్వీ యాజమాన్యం పై అభియోగాలు మోపినట్టుగా తెలుస్తుంది. పార్థసారథి తో పాటు సీఈఓ రాజీవ్ రంజన్ అదే విధంగా సిఎఫ్ఓ కృష్ణ హరిలను అరెస్ట్ సిసిఎస్... వారిని విచారిస్తుంది. పీటీ వారెంట్ పై నిందితులను బెంగళూరుకు క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు అని తెలిసింది. హైదరాబాద్ లో కార్వీ కార్యాలయాలు, పార్థసారథి , రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తున్నారు. కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ... కార్వీ సంస్థల పైన విస్తృతంగా సోదాలు చేస్తుంది.
16 చోట్ల కార్వీ సంస్థ ల పై  సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని కార్వీ దానికి సంబంధించిన పది అనుబంధ సంస్థల్లో సోదాలు చేసారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై ,ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కార్వీ సంస్థపై ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ. కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించింది. మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ పై ఆరా తీస్తుంది. కార్వీ ఇప్పటికే సిసిఎస్ లో  ఐదు కేసులు నమోదు అయినట్టు అధికారులు వివరించారు. పార్థసారథి ఇంటితోపాటు ఇప్పటికే అరెస్టయిన 5 గురి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: