ముక్కులో విస్కీ.. వైరస్ కి ఇదే మందు?
అంతేకాదు అందరిలో అవగాహన పెంచడంలో కూడా సక్సెస్ అయ్యారు. కారణం పెరిగిపోయిన టెక్నాలజీ మాత్రమే. అయితే 1918 కాలంలో వైరస్ గురించి అవగాహన లేకపోవడంతో వైరస్ ఎలా వస్తుంది అనే విషయం కూడా చాలామందికి తెలియక పోయేది. అటు వైద్యులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకునే సరికి ఎంతో ఆలస్యమైపోయింది. ఈ క్రమంలోనే వినూత్నమైన వైద్యాన్ని అందించేవారట అప్పటి డాక్టర్లు. ఇలాంటి చికిత్సల్లో విస్కీ చికిత్స కూడా ఒకటి అనే చెప్పాలి. ఇలా వైరస్ బారిన పడిన రోగులు అందరికీ కూడా ముక్కుద్వారా విస్కీ అందించే వారట.
అప్పట్లో ఈ ప్రయోగాలు ఎంతో విజయవంతంగా పని చేశాయి అన్న ప్రచారం కూడా ఉంది. సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం కారణంగానే ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసేవారట డాక్టర్లు నర్సులు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి అటు డాక్టర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో ఏదైనా వైరస్ వెలుగులోకి వచ్చిన డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది ఆ సమయంలో. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న వైద్యులు వినూత్నమైన చికిత్సను అందించే వారట. 1918లో దక్షిణాఫ్రికాలో విధులు నిర్వహించి వెనక్కి తిరిగి వచ్చిన కేట్ గుజ్జుని అనే నర్స్ కీ స్పానిష్ ఫ్లూ సోకింది. దీంతో ఏకంగా ఆరు వారాల పాటు బ్రాందీ, పాలు, క్వినైడ్, వేడి వేడి నిమ్మకాయ జ్యూస్ మాత్రమే ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది.