జగన్ సర్కార్ కు ఎస్సీ కమీషన్ షాక్...?

Sahithya
ఏపీ, ఒడిస్సా సి ఎస్ లకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డైరెక్టర్ కు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ నివేదిక అందించారు. గతనెల 24 నుండి 28 మధ్య పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్... పర్యటనకు వచ్చినప్పుడే నిర్వాసిత గ్రామాల్లో పునరావాస గృహాల పనులు... సకాలంలో పరిహారం అందక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ అంశాలన్నింటిపై గవర్నర్ కు సైతం అప్పట్లో ఆయన ఫిర్యాదులు చేసారు.
పోలవరం గిరిజన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ పై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోంది అంటూ నివేదికలో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో ఎస్టీ కుటుంబలపై రీ సర్వే చేసి మిగిలి పోయిన లబ్ధిదారులను గుర్తించాలని కోరిన ఆయన... పరిహారం వారికి కూడా అందేలా చూడాలి అని విజ్ఞప్తి చేసారు. భూమికి భూమి ఇవ్వడంలో సర్కార్ తీవ్రజాప్యం చేస్తోంది అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఊరికి దూరంగా వ్యవసాయోగ్యం కాని భూములు అప్పగించిందని రిపోర్ట్ లో వ్యాఖ్యలు చేసారు ఆయన.
నిర్వాసిత గ్రామాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని ఆయన తెలిపారు. కొరత మూలంగా నివసించేందుకు గిరిజనులు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు. నిర్వాసిత కుటుంబాలకు 10 లక్షలు పరిహారం తక్షణం చెల్లించాలంటూ నివేదికలో ఏపీ ప్రభుత్వం కు ఆదేశాలు ఇచ్చారు. గిరిజన సంస్కృతి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిర్వశిత గ్రామాల్లో నిర్మించిన ఇల్లు గోడలు బీట లు వారి , సీలింగ్ లీకేజీ అవుంటుందంటూ మండిపడ్డారు. తక్షణం వాటిని రిపేర్ చేయడం తో పాటు కనీస వసతులు కల్పించాలి అని నివేదికలో ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తీసుకున్న చర్యలపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: