శ్రీకాకుళం వార్త : జగన్ సొంత మనుషులపై కలెక్టర్ సీరియస్ ?
వ్యాక్సిన్ కు కొరత లేదు కొరత అంతా పనిచేసే సిబ్బందిలోనే ఉంది. గ్రామ స్థాయిలో పనిచేసే వారికి ఇవాళ వీటిపై కనీస అవగాహన లేదు. లేదా వాటిపై అవగాహన ఉన్నా ప్రజలకు చెప్పాలి అన్న ఆలోచన లేనే లేదు. ఫలితంగా కోట్లు వెచ్చించినా కరోనా నియంత్రణ అన్నది ప్రభుత్వాలకో సవాలుగా మారుతోంది. పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం వాక్సినేషన్ లో ముందుండాలని జగన్ సంకల్పం. అందుకు అనుగుణంగానే ఆయన వ్యాక్సిన్లను కొనుగోలు చేసి క్షేత్ర స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినా ఫలితం లేదు.
లక్ష్యం ఎలా ఉన్నా ప్రభుత్వం చెప్పిన విధంగా అది అమలు కావడం లేదు. కరోనా కోరలు పీకేయాలన్నది ప్రభుత్వం ఆశయం అయినా సిబ్బంది అందుకు అనుగుణంగా పనిచేయడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రాసెస్ ముందుకు పోవడం లేదు. అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అని కలెక్టర్ నుంచి సీఎం వరకూ చెప్పడమే మిగులుతుంది కానీ శ్రీకాకుళం జిల్లాలో అవేవీ అమలులో లేవు. దీంతో వ్యాక్సిన్ అన్నది అందరికీ చేరువ కావడం లేదు. కరోనా వ్యాప్తిని పూర్తిగా కాకపోయినా కొంతయినా నివారించేందుకు వ్యాక్సిన్ ఓ నివారిణి. కానీ ఆ పాటి శ్రద్ధ కానీ లక్ష్యాలను చేరుకోవడం లో ప్రయత్నం కానీ లేకపోవడంతో, చిత్తశుద్ధి లోపించడంతో అధికారుల పనితీరుపై, వలంటీర్ల పనితీరుపై శ్రీకాకుళం కలెక్టర్ మండి పడ్డారు.
కొండకోనల్లో కరోనా వ్యాప్తిని నివారించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. గిరిజన తండాలకు వ్యాక్సినేషన్ ప్రొగ్రాం అందిం చాలని పరితపిస్తోంది. ప్రభుత్వం లక్ష్యం ఏ విధంగా ఉన్నా అమలు మాత్రం విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ పై అవగాహన క ల్పించాల్సిన వలంటీర్లు పెద్దగా చొరవ చూపని కారణంగా జగన్ అనుకున్న విధంగా లక్ష్యాలు నెరవేరడం లేదు. ఆయన ఆశించి న విధంగా ఫలితాలు లేవు. దీనిపై కలెక్టర్ కైలాష్ బి లఠ్కర్ సీరియస్ అయ్యారు. తనకు కథలు చెప్పవద్దని, మాటలు చెప్పి కాలయా పన చేయడం అన్నది తన దగ్గర కుదరని పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వేళ శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం, మర్రిపాడు సి పంచాయతీ పరిధిలో జలకలింగుపురం వ్యాక్సినేషన్ కేంద్రంను తనిఖీ చేసి, కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరు ను పరిశీలించారు. వ్యాక్సిన్ పై ప్రజలకు అస్సలు అవగాహన కల్పించడం లేదని నిర్థారించారు. దీంతో ఇక్కడి సిబ్బంది పనితీరు బా లేదని, ఎన్ని సార్లు తాను సమీక్షలు నిర్వహించినా ఫలితం మారడం లేదని కలెక్టర్ సీరియస్ అయ్యారు.