థర్డ్ వేవ్ రావాలంటే.. అలా జరగాలి?
అయితే ఇక రెండవ దశ కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడగా.. ఇక దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో చివరికి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఇప్పుడే దేశం మొత్తం కరోనా వైరస్ కోరల నుండి బయట పడుతుంది. ఇలాంటి సమయంలో మరికొన్ని రోజుల్లో కూడా మూడవ దశ కరోనా దూసుకు వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని లేదంటే మూడవదశ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తంలో మూడవ దశ వైరస్ భయం నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే మూడవదశ కరోనా వైరస్ పై ఇటీవలే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లు కాకుండాకరోనా కొత్త వేరియంట్ వెలుగు లోకి వస్తేనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అక్టోబర్ నెలాఖరు నాటికి కరోనా వైరస్ కేసులు సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలలో కూడా చాలా తక్కువ సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ 0.4 శాతం ఉంది అంటూ తెలిపారు. ఇక విద్యాసంస్థల్లో 1.15 లక్షల మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే కేవలం 55 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన.