కేరళలో కంట్రోల్ తప్పిన కరోనా..?

NAGARJUNA NAKKA
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా.. గడిచిన 24గంటల్లో కొత్తగా 20వేల 240 కేసులు నమోదయ్యాయి. అలాగే 67మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తంగా 22వేల 551మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2లక్షల 22వేల 255యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 17.51శాతంగా ఉంది.

కేరళ సీఎం పినరయి విజయన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు. కరోనా నిబందనలను కట్టుదిట్టం చేసినా.. మహమ్మారి కట్టడి కావడం లేదు. మరోవైపు వ్యాక్సినేషన్ సైతం నిరంతరాయంగా కొనసాగుతోంది. కానీ కరోనా ధాటికి ప్రజలు విలవిలాడిపోతున్నారు. కొందరు హోం క్వారంటైన్ లో ఉంటే.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణ పరిస్థితులపై కేంద్రం కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ తగిన సూచనలు ఇస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా 27వేల 254కరోనా కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3కోట్ల 32లక్షల 64వేల 175కు చేరింది. కొత్తగా 219మంది కరోనా ధాటికి బలవ్వగా.. మరణాల సంఖ్య 4లక్షల 42వేల 874కు పెరిగింది. మరో 37వేల 687మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 24లక్షల 47వేల 032కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 74వేల 269యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో ఇప్పటి వరకు 74.38మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.

మరోవైపు ఏపీలో గడిచిన 24గంటల్లో 38వేల 746 కరోనా టెస్టులు చేస్తే.. 864మందికి పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న 12మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 30వేల849కి చేరగా ఇప్పటి వరకు.. 14వేల 10మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 1,310మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 652యాక్టివ్ కేసులున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: