నిరుద్యోం తగ్గింది.

నిరుద్యోం తగ్గింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రం లో నిరుద్యోగం తగ్గింది. ఆంధ్ర ప్రదేశ్లో కేవలం 6.5 శాతం మాత్రమే నిరుద్యోగులున్నారు. సి.ఎం.ఐ.ఇ గణాకాల ప్రకారం భారత్లో నిరుద్యోగ శాతం సెప్టెంబర్ 12 నాటికి 7.9 శాతంగా   ఉంది. పట్టణ ప్రాంతాలలో 9.4 శాతం కాగా, గ్రామాణ ప్రాంతాలలో 9.4 శాతం మంది నిరుద్యోగులున్నారు. దేశంలో ని నిరుద్యోగుల శాతంతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు మూడు శాతానికి పైగా తక్కువ. హర్యానా రాష్ట్రం పట్టణ ప్రాంతాలలో 35 శాతానికి పైగా నిరుద్యోగులున్నారు. కరోనా మహమ్మారి ముప్పెట దాడికి ప్రపంచం అతలాకుతం అవగతున్న నేపథ్యంలో తాజా గణాంకాల వివరాలు జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వానికి కొంత ఊరటను కలిగించాయి. 6,5 శాతం ఉన్న నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలకో ఎదురు చూస్తున్నారు.
 ఆంధ్ర ప్రదేశ్ లోని చట్ట సభలకు ఎన్నికలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.  ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ, ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఆకర్షించ డానికి చాలా విద్యలు ప్రదర్శిస్తాయి. వాటిల్లో ఒకటి ఎన్నికల మానిఫోస్టో.   ఓటర్ల జాతరలో విజయం చేజిక్కించుకుని, అధికారాన్ని కైవశం చేసుకోవడం కోసం  లిఖిత పూర్వహ హామీలెన్నో ఈ ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తారు. ఈ ప్రణాళికలు ఎంత మందికి చేరుతాయనేది ప్రధాన ప్రశ్న.
ప్రధాన రాజకియ పార్టీలు 2014 ఎన్నికల్లో  విడుదల చేసిన మానిఫెస్టోలలో చేసిన వాగ్దానాలు పరాకాష్టకు చేరాయి. సంవత్సరాల తరబడి అధికారంలో ఉన్నరాజకీయపార్టీలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఘలమయ్యాయా ? లేకుంటే ఇంత పెద్ద ప్రణాళికలు అవసరమా ? అన్న ప్రశ్న విద్యావంతులందరిలోనూ మెదిలిన అంశం.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 2019 ఎన్నికల ముఖచిత్రం మారింది.  పేజీల కొద్దీ పుస్తకాల రూపంలో ఉన్న రాజకీయ పార్టీల మానిఫెస్టో కాస్తా రూపు మారింది. కొన్ని రాజకీయ పార్టీలు డిజిటల్ విధానాలను అవలంబించాయి.  నాటి ప్రతిపక్ష పార్టీ వై.ఎస్. ఆర్. కాంగ్రెస్  పార్టీ మాత్రం కరపత్ర పరిమాణంలో తన ఎన్నికల ప్రణాళికను ప్రచురించి, ప్రజల్లోకి తెచ్చింది.  నవరత్నాలే తమ ప్రణాళిక అంటూ ఎన్నికల ముందుకు వచ్చింది. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ నెలకొల్పింది. రెండున్నరేళ్ల పదవీకాలంలో ఒకట్రేండు మినహా దాదాపు అని వాగ్దానలనూ అమలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: