హైదరాబాద్ లో కొత్త బిర్యాని.. ఇప్పుడిదే ట్రెండ్?
అంతలా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు సైతం ఒక్కసారి తెలంగాణకు వచ్చారు అంటే హైదరాబాద్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్ళరూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ వాసులు అయితే ప్రతిరోజు బిర్యానీ తమ రోజువారీ ఆహారంలో ఒక మెనూగా పెట్టుకుంటారు అని చెప్పాలి. ఇప్పటి వరకు హైదరాబాదులో ఎన్నో రకాల బిర్యానీలు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కొత్త బిర్యానీ ట్రెండ్ నడుస్తోంది. ఇక ఈ కొత్త బిర్యానీ ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తోంది.
ఇంతకీ ఈ కొత్త బిర్యానీ పేరు ఏంటి అంటారా నల్లి బిర్యాని. ప్రస్తుతం ఇదే హైదరాబాద్లో ట్రెండ్. ప్రస్తుతం హైదరాబాద్లోని బడా బడా హోటల్స్ సైతం ఇక ఈ నల్లి బిర్యానీని బోర్డులు పెట్టి మరీ అమ్ముతున్నాయి అని చెప్పాలి. ఇక జనాలు కూడా హైదరాబాదులో కొత్త బిర్యాని పేరు వినిపిస్తూ ఉండడంతో ఇక ఈ కొత్త రుచిని ఆస్వాదించడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన ఈ బిర్యానీ ఇప్పుడిప్పుడే భాగ్యనగరంలో విస్తరిస్తూ ఉంది. మటన్ నుంచి మూలుగా బొక్కలను వేరుచేసి వాటిని కూర వండి ఇక బిర్యాని సపరేట్ వండి ఆ రెండింటినీ కలిపి వడ్డిస్తే అదే నల్లి బిర్యాని.