ఎవరికి వారే యమునా తీరే.. సవాళ్ళతో వేడెక్కిన రాజకీయం..?

MOHAN BABU
తెలంగాణలో రాజకీయం  కుక్కల కొట్లాట లాగా కనబడుతోంది. వారివారి హోదాలను మర్చిపోయి బూతు పురాణం మొదలుపెట్టారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక్క నాయకుడు అని కాదు అందరూ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరికి వారే హీరోలుగా ఫీలైపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, బూతులతో పబ్బం గడుపుతున్నారు . ప్రజలు వీరిని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నది  ఒకరి ఆస్తుల వివరాలు ఒకరు తోడు కుంటూ తిట్టుకుంటూ పాలన చేయాలనే ఎన్నుకున్నారా..? ఈ తతంగాన్ని చూస్తే అలాగే అర్థం అవుతోంది. రేవంతన్నపై పోటీ చేయాలని మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ విసురుతున్నాడు. గజ్వేల్ లో రేవంత్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ గెలవాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం అయినా మూడు చింతలపల్లి లో  దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ముగింపు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలు ఎలాంటి అనుమతులు లేవని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు వార్తల్లో కేక్కాయి.


 దీనికి ప్రతి సవాలుగా మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాలు విసిరి రాజకీయవేడి పుట్టిస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై చేసినటువంటి ఆరోపణలు నిజమైతే తను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని రేవంత్ నువ్వు కూడా రాజీనామా చేయాలని దానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరాడు. ఇలా రేవంతు మల్లారెడ్డిలు ఒకరిపై ఒకరు సవాళ్లు వేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. తనపై పోటీ చేసే ముందు గెలవాలని మల్లారెడ్డి సవాల్ చేస్తే, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ రాజీనామా చేసి రేవంత్ రెడ్డిపై గెలవాలని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. అవినీతి అక్రమాలపై మాట్లాడితే మల్లారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. మూడు చింతలపల్లి లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారంలోకి రాలేరని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.


అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేసినట్లయితే ఆధారాలతో బయట పెట్టాలని ఆయన, ఇక నుంచైనా మాటలు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ తెరాస నేతలు ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేస్తుంటే కార్యకర్తల ఆందోళన వరకు వెళ్లాయి. ఇలా రాష్ట్రంలో  మాటలు తప్ప ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు  ప్రభుత్వంలో లేదు, అటు ప్రతిపక్షంలో లేరని  ఎప్పుడూ వారి గురించే వారు మాట్లాడుకుంటూ తిట్టుకోవడమే జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: