ఇంటింటికీ బంగారం ఇచ్చిన టిఆర్ఎస్ కు ఓటు వేయరు ?

Veldandi Saikiran
యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత - గిరిజన దండో రా దీక్ష లో ఇవాళ పాల్గొన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  ఈ సందర్భాంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..  కాంగ్రెస్ పా ర్టీ అధికారం లోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వాసాలమర్రి కి తెలంగాణ  సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా  అడ్డు కుంటామని హెచ్చరికలు జారీ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకున్నాడని..  ఆ బొంద మేమే పుడుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పేర్కొన్నారు. 


 సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వ గానే దళితలందరికి ఇచ్చినట్టా ? అని నిలదీశారు.  ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఎవరు ఓటు వేయరని సిఎం కెసిఆర్ కు చురకలు అంటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి  పది లక్షలు ఇస్తే నేను రాజీనామా చేస్తా.. పోటీ చేయనని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... నీ కూతురు కవిత కు టికెట్ ఇవ్వు తాను గెలిపిస్తానని సవాల్ విసిరారు.   


ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలేకనే కొక పేట భూములు అమ్మిన బ్రోకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిప్పులు చెరి గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గన్ని దత్తత తీసుకోవాలని.. కేసీఆర్ కళ్ళ కింద్ర ఉన్న తెలంగాణ ఆత్మగౌరవం  విడిపించాలన్నారు. దళిత బంధు తో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని.. కేసీఆర్ మంత్రివర్గం లో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమల చోటు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఎం కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యం అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలదని చెప్పారు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: