ఆఫ్ఘనిస్తాన్ లో తిరుగుబాటు.. 300 మంది తాలిబన్లు మటాష్?

praveen
దాదాపు రెండు దశాబ్దాల కిందట తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్ని అరాచకాలు సృష్టించారో  ప్రపంచం ఇంకా మరిచిపోలేదు.  ఏకంగా ఆయుధాలను చేతపట్టి కనిపించిన వారిని తమ బానిసలు గా భావిస్తూ ఎన్నో అరాచకాలు సృష్టించారు  ఎంతో మందిని దారుణంగా కాల్చి చంపారు. మహిళలను  కేవలం శృంగారం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇలా అప్పట్లో తాలిబన్ల పాలన ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో  ఒక పీడకల లాంటిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఆ తర్వాత అమెరికా అండతో తాలిబన్ల అరాచకాలకు అడ్డుకట్ట వేశారు.  మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఇటీవలే ఆయుధంతో మరోసారి ఆదిపత్యాన్ని సాధించారు తాలిబన్లు.



 ఈ క్రమంలోనే అఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారూ. ఎదురు తిరిగిన వారిని చంపేస్తున్నారు. అయితే ఒకప్పుడు తాలిబన్ల పేరు చెబితే చాలు వణికిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇప్పుడు మాత్రం ఇక తాలిబాన్లు మరోసారి ఆధిపత్యాన్ని సాధించడంతో వారి పాలన వస్తుంది అన్న విషయాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక తిరుగుబాటు ప్రారంభిస్తున్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఇంకా ఏర్పాటు కూడా చేయలేదు. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటు రోజురోజుకు పెరిగిపోతోంది. ఏకంగా తిరుగుబాటుదారులు అటు తాలిబన్లను ఎక్కడికక్కడ ఏరిపారెస్తున్నారు.



 ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్లో పంజ్ షీర్ ను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు ఎన్ని రోజులనుంచి ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తూ చేస్తున్నారు. ఇక పంజ్ షీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు అటు తాలిబన్లు బయలుదేరగా..  ఇక అటు ప్రజలు మాత్రం ఏకంగా ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏకంగా 300 మంది తాలిబన్లను చంపేశారు అక్కడి స్థానిక ప్రజలు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్న తాళిబాన్లు.. భారీగా వాహనాల్లో అక్కడికి బయలుదేరినట్లు అంతర్జాతీయ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇక తాము మాత్రం అసలు లొంగి పోయేది లేదు అంటున్నారు పంజ్ షీర్ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: