వైసీపీ సజ్జలలో మీకు తెలియని కోణం ఇది..?

Chakravarthi Kalyan
సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈయన ఎవరు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వ సలహాదారుడు.. అది ఓకే.. మరి అంతకు ముందు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు.. ఆయన ఒక వైసీపీ నాయకుడు.. జగన్‌ కోటరీలో కీలక నేత.. అది సరే.. అంతకన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు.. ఆయన సాక్షి దినపత్రికలో కీలక జర్నలిస్టు.. అది సరే.. అంతకన్నా ముందు.. అంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయం వంటి పత్రికల్లో పని చేసిన జర్నలిస్టు.. ఈ విషయమే బహుశా చాలా మందికి తెలియదు.


సజ్జల రామకృష్ణారెడ్డి ఓ సత్తా ఉన్న జర్నలిస్టు.. ఆయన ఉదయంలో చాలా బాగా పని చేశారని.. అప్పటి ఓ ఎడిటర్ ఇటీవల తన ఫేస్‌ బుక్‌లో కూడా చెప్పుకున్నారు. ఎవరో చెప్పడం ఎందుకు.. జర్నలిస్టుగా తన అనుభవాలను తాజాగా ఆయన మీడియా ముఖంగా పంచుకున్నారు. కడప బ్రౌన్  గ్రంధాలయంలో జరిగిన ఒకనాటి పాత్రికేయ దిగ్గజం గజ్జెల మల్లారెడ్డి స్మారక అవార్డుల ప్రదానం కార్యక్రమం అందుకు వేదిక అయ్యింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి తన పూర్వ అనుభవాలు పంచుకున్నారు.


గజ్జల మల్లారెడ్డి గారు తనను ఎంతో ప్రోత్సహించారని... ఆయన వల్లే తన జీవితం మలుపు తిరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి  గుర్తు చేసుకున్నారు. 1978 -79 లో  హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఓ పేద్ద దినపత్రిక లో పరీక్ష రాయడం..  ఆయన అభినందన మర్చిపోలేనిదన్నారు. అప్పటి నుండి గజ్జెల మల్లారెడ్డితో తన  ప్రయాణం సాగిందని.. ఆయన గురించి నేర్చుకున్నవి చాలా ఉన్నాయని... సాహిత్యం, సహాయం, ప్రోత్సహం లాంటివి ఆయన చొరవేనని సజ్జల రామకృష్ణారెడ్డి  గుర్తు చేసుకున్నారు.


ఏబీకే ప్రసాద్, దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి, ఆర్ వి రామారావు లాంటి వారితో తన పాత్రికేయ ప్రయాణం సాగిందన్న సజ్జల.. కమ్యూనిస్టు పార్టీతో రచయితలు సాహితీ వేత్తలు ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీలతో కూడా తన ప్రయాణం సాగిందన్నారు. తన ఎదుగుదల మొత్తంలో కీలక పాత్ర గజ్జల మల్లారెడ్డి గారిదేనని వినమ్రంగా చెప్పుకొచ్చారు సజ్జల.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: