హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

MOHAN BABU
 హుజురాబాద్  నియోజకవర్గంలో  ఈరోజు  సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఈ రోజు పాల్గొన్న సభలో  దళిత బంధువు చెక్కులను లబ్ధిదారులకు అందజేయ నున్నారు. ఈ నేపథ్యంలోనే  హుజూరాబాద్ నియోజ కవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో  పోలీసు నిర్బంధాలతో చీకటి రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్నారు. నియోజక వర్గంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రోటోకాల్ ను వదిలేసి  శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రశ్నించాడు. హుజురాబాద్ ప్రజలమీద పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు, అధికారులు, ఇలా తోడేళ్ల లాగా విరుచుకు పడుతున్నారని అన్నారు. బిజెపి నాయకులు కార్యకర్తలు, మరియు ఇతర పార్టీల నాయకులను క్రియాశీలకంగా ఉన్న వారిని  టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని  ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ కు చెందినటువంటి ప్రభాకర్ రావు టీం సభ్యులు  ఇంటింటికి వెళ్లి మరి బెదిరింపులకు గురి చేస్తున్నారని అలాంటి చర్యలకు మానుకోకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. హుజురాబాద్ లో విధులు నిర్వహిస్తున్న టువంటి పోలీసులు, మరియు అధికారుల తీరుపై అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్బంధాల పై కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపామని వీటిలో తెలిపారు.

ఇప్పటికైనా పోలీసులు అధికారులు బెదిరింపులకి పాల్పడి వద్దని లేనిపక్షంలో హెచ్ఆర్సీకి, హైకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేశారు. అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే  శిక్ష తప్పదని, తర్వాతి పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారని హెచ్చరికలు జారీ చేశాడు. ఎప్పుడో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాం. దళిత బందులు మేము స్వాగతిస్తున్నామని  అది అందరికీ ఇవ్వాలన్న నా మాటలను కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వక్రీకరిం చారని వారికి దళితులే బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. దళిత బందుకు ఇప్పటికి కూడా విధి విధానాలు పూర్తి చేయలేదని,  ఈ యొక్క దళిత బందును నిజమైన దళితుల కాకుండా  టీఆర్ఎస్ నాయకులకు, డబ్బు ఉన్న వారికి, వారికి దగ్గరగా ఉన్న వారికి  మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం వస్తున్నాడని  ప్రతిపక్ష పార్టీల వారిని అరెస్టు చేయడం అనేది ఏ చట్టంలో ఉన్నదని అడుగుతున్నారు.

పోలీస్ అరెస్ట్ చేసిన వారికి  కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మా ఓపికను బలహీనంగా మారిస్తే మంచిది కాదని, బేషరతుగా వారందరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంతోనే టిఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పడుతుందని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు పిచ్చివాళ్లు కాదని, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అని, దానికి కారణం ఈటెల రాజేందర్ అని మర్చిపోకండి అని ఆయన కోరారు. ఇలా సీఎం సభ ఇవ్వాళ జరగనుండడంతో  హుజురాబాద్ నియోజకవర్గంలోని కాకుండా  హుజరాబాద్ దగ్గరలోని అన్ని ప్రాంతాలలో ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: