వామ్మో.. కొండచరియలు ఎలా విరిగిపడ్డాయో చూడండి?

praveen
దేశంలోని కొన్ని ప్రాంతాలలో కొండ చర్యలను ఆనుకునే రహదారులు ఉంటాయి. అయితే ఇలా కొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాలలో  ప్రయాణం చేసే సమయంలో అందరూ వణికి పోతూ ఉంటారు. ఎందుకంటే ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడిపోతుంటారు. ఒకవైపు ఎన్నో బండరాళ్లతో ఉన్న కొండ ఇంకోవైపు లోయ ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడిపోతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి.



 వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎన్నో ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు పోయిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి  అందుకే ఎక్కువ మంది కొండచరియలు  ఉన్న ప్రాంతాలకు వర్షాకాలంలో వెళ్లడానికి కాస్త వెనుకడుగు వేస్తుంటారు.  అయితే ఇలా కొండచరియలు విరిగిపడటంకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కి వచ్చి అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది  ఇటీవలే కొండచరియలు విరిగిపడిన వీడియో అందరినీ గగుర్పాటుకు గురి చేస్తోంది. అయితే ఇక ఈ వీడియోలో చూస్తుంటే ఎవరి ప్రాణాలు పోలేదు కానీ తృటిలో ప్రమాదం తప్పింది.



 ఉత్తరాఖండ్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. రిషికేశ్ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవలే కొండచరియలు విరిగిపడ్డాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. తృటిలో ప్రమాదం తప్పింది. తోట ఘాట్ సమీపంలో ఓ కొండపై పెద్ద ఎత్తున మట్టి చరియలు విరిగిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ వాహనాలు దూరంగా ఉండటంతో ఇక పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాలి. అంతే కాదు అక్కడ మట్టి చరియలు విరిగి పడిన సమయంలో ప్రయాణికులు కూడా దూరంగానే ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక మట్టి చరియలు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు త్వరలో పూర్తి చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: