దొంగ ఓట్లు వేయిస్తారా అక్కడ?
ఎంతగా ప్రభావితం చేయనుందో?
ఒకే ఒక్క ఎన్నిక ఎందరిని
శత్రువులుగా తయారు చేసుకోనుందో??
ఒకే ఒక్క ఎన్ని ఎన్ని వేల కోట్లకు
సంబంధిత అవినీతికి కేరాఫ్ కానుందో???
మరి! దొంగ ఓట్లు ఎవరివి వందల కోట్లు ఎవరికి?
అసలు ఈటెలకూ కేసీఆర్ కూ ఎక్కడ పొసగలేదో కానీ హుజురాబాద్ ను మాత్రం అత్యంత ధనిక నియోజకవర్గంగా మార్చేస్తున్నా రు వీరిద్దరూ..ఓ వైపు పోలీసులకు కంటి పై కునుకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్..తన మనిషి గెలిచేందుకు వీలున్న మార్గాలన్నింటి నీ సుగమం చేయాలన్నది కేసీఆర్ భావన. ట్రబుల్ షూటర్ సాయంతో కేసీఆర్ రాజకీయం నెరపుతున్నా ఈటెల మాత్రం ఇవన్నీ నిజాయితీతో సంబంధం లేని పనులు అని మండిపడుతున్నారు. డబ్బులు పంచేందుకు చేస్తున్న ప్రణాళికలకు ఈ సారి కూడా పో లీసులే సాయం చేస్తారని,గతంలో కూడా వారిదే కీలకం అని విపక్షాలు మండిపడుతున్నాయి.ఇక బీజేపీ కూడా ముందు న్న దూకుడుతో లేనప్పటికీ స్టార్ క్యాంపైనర్లను దిపేందుకు రాజా సింగ్ లాంటి వారితో తిట్టించేందుకు కాస్త ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అన్న ఆ లోచనలతో తర్జన భర్జన పడుతోంది. వాస్తవానికి బీజేపీ కి స్టార్ క్యాంపైనర్లు లేకపోయినా ఈటెల హవా ముందు కేసీఆర్ మనిషి తలదించక తప్పదని కొందరు కమల నాథులు అంటున్నారు. పాదయాత్ర ఆగిపోయినా సానుభూతి ఎక్కడికీ పోదని, తాము దొంగ రా జకీయం చేయమని చెబుతున్నారు నిజాయితీ నిండిన గొంతుకతో బీజేపీ మనుషులు...
ఒకవైపు ఆర్ ఎస్ ప్రవీణ్ కాస్త మెత్తబడిన చందంగా ఉన్నారు.అప్పటిలా పెద్ద పెద్దగా కామెంట్లు అయితే చేయడం లేదు.నేను కేసీ ఆర్ ను కామెంట్ చేయను అన్న అసక్తత కూడా ఎందుకనో చూపిస్తున్నారు.మరోవైపు ఈటెల మాత్రం తనను కార్నర్ చేస్తున్న ప్రతి ఒక్కరినీ తిట్టి పోస్తున్నారు.నిజాయితీగా ఓట్లు తెచ్చుకోవాలి కానీ ఇలా చేయడం తగదని,కోట్లు ఖర్చు చేసి గెలుపొందడం క న్నా తనపై కేసీఆర్, హరీశ్ పోటీచేసి గెలిచి సత్తా నిరూపించుకోవాలని అంటున్నారు.
మరోవైపు ఈటెల మాత్రం ఒంటరిపోరు చేస్తూనే ఈ ప్రాంతంలో తన అనుచరులను తిరగనివ్వడం లేదని అంటున్నారు.కేసీఆర్, హరీశ్ రావు పై మండిపడుతున్నారు. వేల కోట్లు ఖర్చు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇదే సమయంలో ఈటెల కు మద్ద తుగా నిలిచే నాయకులు లేనప్పటికీ కేసీఆర్ ను టార్గెట్ చేయడం మాత్రం ఆయన మానుకోవడం లేదు.ఒక విధంగా ఆయనకు జీవన్మరణ సమస్యగా పరిణమిస్తోంది.అదేవిధంగా నిఘా వర్గాలను ఇబ్బడిముబ్బడిగా తనకు అనుకూలంగా వాడుకోవడం వంటి పను లు కూడా కేసీఆర్ చేయిస్తున్నారని మరో ఆరోపణ కూడా చేశారాయన.