ఎకో ఫ్రెండ్లీ గవర్నమెంట్ .. : ఓ రాజా.. వెళ్లిపోయావా!
ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు
కాలుష్య నివారణ చర్యలు
చేపట్టాలి
ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఫ్యాక్టరీలు తాము సమాజ
శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి
కొత్తగా ఒక్కటంటే ఒక్క ఫ్యాక్టరీ లేదు..ఇప్పటికిప్పుడు రాదు కూడా..కానీ ఉన్న కంపెనీలు మాత్రం పక్కకు పోతున్నాయి. ఏమంటే తమకు ఆ ఉద్దేశాలే లేవని జనారోగ్యమే తమకు ధ్యేయమని ప్రభుత్వం చెబుతోంది.ఇందుకు హైకోర్టుకు సమర్పించిన నమూనాలు. కోర్టు చెప్పిన మాటలు ఇలా అన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రజలపై మరో మారు ప్రేమ కుమ్మరిస్తోంది వైసీపీ సర్కార్. తాజాగా చిత్తూరు నుంచి పోతున్న అమర్ రాజా బ్యాటరీల కంపెనీనే ఉదాహరణ. కానీ ప్రభుత్వానికి బాధే లేదు.పైగా లాభాల కోసమే తరలిపోతోందని బొత్స లాంటి మంత్రులు చెబుతుండడం విచారకరం. పర్యావరణానికి మేలు తెచ్చే ఫ్యాక్టరీలు అదేలేండి ఎకో ఫ్రెండ్లీ ఫ్యాక్టరీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు జగన్ ఎన్ని తీసుకువచ్చారో వైసీపీ పెద్దలే చెప్పాలి.
కాలుష్యాన్ని తగ్గించే పని
యాజమాన్యంది అందుకు తగ్గ విధంగా
పనిచేయించే సత్తా ప్రభుత్వానిది
ఇవేవీ కాదనలేం కానీ
ప్రభుత్వం మాత్రం అమర్ రాజా ఫ్యాక్టరీపై
సంబంధిత కాలుష్య కారకాలపై
తెగ స్పీచ్ లు దంచుతోంది..
విశాఖ కేంద్రంగా ఫ్యాక్టరీలు, శ్రీకాకుళంలో ఫ్యాక్టరీలు లెక్కకు మిక్కిలి కాలుష్యం వెదజల్లుతున్నాయి. వీటిని జగన్ తీయించేస్తారా లేదా మూయించేస్తారా.. పరవాడలో ఉన్నవి..కొవ్వాడ రీజియన్ కు రిలవెంట్ గా ఉన్నవి అన్నీ కాలుష్యంకు సింబల్సే.. ఇవన్నీ స్థానిక అవసరాలు అవకాశాలు ఇన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి కానీ ఇవి పర్యావరణ హిత కారిణిలు అని చెప్పగలరా? అసలు కాలుష్యం రాజకీయ కారణంగా రేగిందా లేకా అవసరాల రీత్యా రేగిందా అన్నది కూడా ఓ సందేహం. కోర్టు మీకు అవసరం అనిపిస్తే మంచిది..లేదంటే చెడ్డది. ఇలా ఇంకొన్ని ఫ్యాక్టరీలు తరలిపోతాయా? ఏమో కానీ ఇప్పటికి ఇదే పెద్ద నష్టం.
ప్రభుత్వం చెప్పేదే నిజం అనుకుందాం మరి!
ఇతర ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న
ప్రజలకూ రక్త పరీక్షలు చేయించండి సర్..
ప్లీజ్ అప్పుడు సీసం స్థాయి ఎంత ఉంది
వారి ఆరోగ్య స్థితిగతులేంటి అన్నవి తేలిపోతాయి