వాహనదారులు అలర్ట్.. ఒక్క చలానా ఉన్న బండి సీజ్?
తర్వాత కడదాం లే.. అంటూ చలాన్లు కట్టడాన్ని తరచూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల తెరమీదికి వచ్చిన వార్త తెలిస్తే మాత్రం వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఇకనుంచి చలానాల విషయంలో అలసత్వం నిర్లక్ష్యం వహిస్తే కష్టాలపాలు కాక తప్పదు. ఎందుకంటే ఇకనుంచి ఒక్క చలాన్ పెండింగ్లో ఉన్న కూడా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేస్తారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం ఇటీవలే పర్వత్ నగర్ చౌరస్తాలో నిఖిలేష్ అనే న్యాయవాది బైక్ ని ఆపారు పోలీసులు. ఒక చలన పెండింగ్లో ఉందన్న కారణంతో సీజ్ చేయడం సంచలనంగా మారింది
కూకట్పల్లి కోర్టు లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు నిఖిలేష్. ఈ క్రమంలోనే ఇటీవల పర్వత్ నగర్ లో తనిఖీలు చేస్తున్న పోలీసులు నిఖిలేష్ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. అయితే వెంటనే ఆ వాహనంపై ఉన్న చలనాలను చెక్ చేయగా పదహారు వందల యాభై రూపాయలు పెండింగ్లో ఉంది. ఇక వెంటనే ఈ చలనాలు చెల్లించాలి అంటూ పోలీసులు కోరగా.. ఆ న్యాయవాది మాత్రం నిరాకరించాడు. ఇంకేముంది ఊహించని విధంగా షాక్ ఇచ్చారు పోలీసులు. ఏకంగా బండి సీజ్ చేశారు. దీంతో షాక్ అయిన న్యాయవాది ఒక్క చలాన్ కి బండి ఎలా సీజ్ చేస్తారు అని ప్రశ్నించగా.. ఇక రోడ్డు నిబంధనలు అన్నింటినీ కూడా ఎస్ఐ.. నిఖిలేశ్ కి వివరించి నోరు మూయించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఒక్క చలానా పెండింగ్ లో ఉన్న బైక్ సీజ్ చేయొచ్చు అని చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన మిగిలిన వాహనదారులు అందరూ షాక్ అవుతున్నారు. వెంటనే తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు