తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఎంతో ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఈ బోనాల పండుగ వచ్చిందంటే...తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా... రాజధాని హైదరాబాద్ లో ఈ పండుగ కోలాహలం ఉంటుంది. ఆషాఢ మాసంలో అంటే జులై మాసంలో ఈ బోనాల పండుగ వస్తుంది. ఈ బోనాల పండుగను.. తెలంగాణ సర్కార్ కూడా అధికారికంగా జరుపుతుంది. దీంతో బోనాల పండుగకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే.. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆషాఢ మాసం బోనాల పండుగ ఉత్సావాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్.
ముఖ్యంగా తెలంగాణ పోలీస్ ఎక్కువగా..మహానగరం హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం, సోమవారం అంటే.. ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీల్లో హైదరాబాద్ నగరం పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు... ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా వైన్ షాపులు, కల్లు దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తు వస్తున్నామని... అందుకే ఈ సారి కూడా అదే తరహాలో మూసీవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ. బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, మరియు రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ.