గుర్తుంచుకోండి.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి?
ఇటీవలి కాలంలో ఎంతో మంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఎంతో మంది అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు కూడా వెనకాడటం లేదు జనాలు. దీంతో కొంత మంది అధికారులలో మార్పులు వచ్చినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇంకా లంచాలకు మంచం వేస్తూ ఎంతోమంది జనాలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎంతో మంది జనాలు లంచాలు అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులను ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు. అంతేకాదు ప్రజలందరికీ అవినీతి నిరోధక శాఖ పై ఎంతో అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇక ఎవరైనా లంచం అడిగితే ఫోన్ చేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ నెంబర్ను తప్పకుండా సేవ్ చేసుకోండి. అధికారులు లంచం అడిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫోన్ చేయాలి అనుకుంటే 1064 ఈ నెంబర్కు కాల్ చేయాలి లేదా 9440446106 ఈ నెంబర్కు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఏపీలో అయితే 14400 నెంబర్ కి ఫోన్ చేయాలి అయితే మీరు ఏసీబీ అధికారులకు చెప్పినట్లుగా ఎలాంటి సమాచారం బయటకు రాదు.