టీఆర్ఎస్ మాజీ లీడర్ ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా తో ఆయన సొంత నియోజకవర్గంలో... ఉప పోరుకు దారి తీసింది. దీంతో తో ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం లో భాగంగా గులాబీ పార్టీ రకరకాల వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ ... జోరుగా ప్రచారం సాగిస్తోంది. మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కరుగా తమ... ప్రచారాన్ని సాగిస్తున్నాడు.
బయటకు కనిపించకుండా ఆర్థిక మంత్రి హరీష్ రావు.... హైదరాబాద్ ఉప ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ టిఆర్ఎస్ తనదైన శైలిలో ఈటల రాజేందర్ పై విమర్శల అస్త్రాలను సంధిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈటల రాజేందర్....సీఎం కేసీఆర్ క్షమాపణలు కోరుతూ లేఖ రాసినట్లు ఓ వార్తను వైరల్ చేసింది టిఆర్ఎస్ పార్టీ. అయితే దీనిపై అప్పుడు స్పందించిన ఈటల రాజేందర్.... ఆ వార్తలన్నీ టిఆర్ఎస్ కథనాలు అని తేల్చేశారు. ఇక తాజాగా మరో వివాదానికి సోషల్ మీడియా అడ్డగా మారింది. ఈసారి ఏకంగా ఈటల రాజేందర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
" టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చాక తన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.... ఇక రాజకీయాల్లో ఉంటే నష్ట పోతాను. ఇక ముందు నా వ్యాపారాలను చూసుకుంటా. ఇక రాజకీయాల నుంచి తప్పు కుంటున్నాను. ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను. " అని ఈటల రాజేందర్ అన్నట్లు ఓ పోస్టర్ ఓ టిఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో హుజురాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అయితే దీని పై ఈటల రాజేందర్ ఇంకా స్పందించలేదు. ఇక ఈ ప్రచారం అంతా టిఆర్ఎస్ పార్టీ దే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.