దర్శనానికి వెళ్లి నల్లమల అడవుల్లో చిక్కుకున్న 100మంది భక్తులు?
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే భక్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. దీనిపై మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మెట్ల పెద్ద వంకలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు... మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తూ ఉండడంతో నలికిరి సెల నుండి మోట్ల పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోందని పేర్కొన్న ఆయన.
ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదని స్పష్టం చేశారు. మోట్ల పెద్ద వంక అవతల చిక్కుకున్న వారికి ఆహారము మంచినీళ్లు అందిస్తున్నామన్నారు.. ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. వరద ఉధృతంగా ప్రవహిస్తూన్న నేపథ్యం లో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి అని వెల్లడించారు చీకటి పడడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి ఎవరినీ వెళ్లకుండా పోలీసులతో అటవీ శాఖ అధికారులతో చర్యలు చేపట్టామని తెలిపారు. ఘటన స్థలం లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 21 వ తేదీన మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.