హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?

Veldandi Saikiran
మాజీ మంత్రి ఈటల రాజేందర్... టిఆర్ఎస్ పార్టీ మరియు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ముఖ్యంగా ఈటల రాజేందర్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యం అయిపోయింది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేశాయి. అంతే కాదు అనేక ప్రలోభాలకు తెర లేపుతూ.... ఇతర పార్టీల లీడర్లను లాగేసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.


నిన్నటి వరకు ఈటల రాజేందర్ బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తారని జోరుగా ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈటల రాజేందర్ భార్య... ఈటల జమున ఈ ఉప ఎన్నికలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నేను ఉన్నా..ఈటల రాజేందర్ ఉన్నా ఒక్కటేనని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు ఈటల జమున. ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఈటల జమున.... ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచన ఉందని కుండ బద్దలు కొట్టారు.  ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుందని... కాకపోతే మనుషులే మారొచ్చు అని పేర్కొన్నారు ఈటల జమున. దీంతో హుజురాబాద్‌ లో రాజకీయాలు మరోసారి వెడేక్కాయి.


 ఈటల జమున తాజాగా వ్యాఖ్యలతో ఈటల  శిబిరంలోనూ కలవరం మొదలైంది. ఈటల రాజేందర్‌ పోటీ చేయకపోతే... హుజురాబాద్‌ లో గెలవడం చాలా కష్టమని అనుకుంటున్నారట. జమున ను హుజురాబాద్‌ లో పోటీకి దించి.. మహిళల సెంటిమెంట్‌ తో గెలువాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుందట. జమున పోటీలో ఉంటే.. టీఆర్‌ఎస్‌ దూకుడును తగ్గిస్తుందని...అప్పుడు బీజేపీ గెలుపు సులభం అవుతుందని బీజేపీ భావిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. హుజురాబాద్‌ బరి నుంచి ఈటల రాజేందర్‌ తప్పుకోనున్నట్లే అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: