కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

Veldandi Saikiran
తెలంగాణ ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ కు మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తోనే.... రాష్ట్రంలో 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. రెండోసారి అధికారం కట్టబెట్టిన తర్వాత.. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే 2018 లో గెలిచిన అప్పటి నుంచి టిఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం... ఆ తర్వాత దుబ్బాక, జిహెచ్ఎంసి లో ఘోర పరాభవం మరియు ఈటెల రాజేందర్ పార్టీని వీడడం ఇలాంటివి ఘటనలు అధికార పార్టీకి ఎదురయ్యాయి.

ఇది ఇలా ఉండగా... గులాబీ బాస్ కెసిఆర్ ను టిఆర్ఎస్ నేతల ప్రవర్తన ఆందోళనకు గురి చేస్తోంది.  ఏకంగా మంత్రులే ప్రజా సభల్లో నోరు జారు తున్నారు. ఈ మధ్యలో ఈ ఘటనలు చాలా ఎక్కువ అయ్యాయి. ఎర్రబెల్లి మొదలుకొని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వరకు ఇలా ఒక్కొక్కరు టంగ్ స్లిప్ అవుతున్నారు. ఉన్న వరంగల్ లో జరిగిన పట్టణ ప్రగతి లో ఓ మహిళను అసభ్యంగా మాట్లాడుతూ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కెమెరాల ముందు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో మహిళా సంఘాలు ఒక్కసారిగా టిఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోశాయి. ఈ ఘటన జరిగి ఒక్కరోజు కూడా కాక ముందే.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా చంద్రబాబుని పొగిడేశారు. హుజురాబాద్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమం లో.... కేసీఆర్ స్థానంలో చంద్రబాబును "సల్లగుండ" అంటూ గంగుల కమలాకర్ నోరు జారారు.

 దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా గంగుల... చంద్రబాబును మర్చిపోవడం లేదంటూ కామెంట్లు పెట్టారు. ఇక నిన్న ఎంతో వినయంగా కనిపించే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న ఎవ్వరికీ.... సర్కారీ నౌకరి రాదని.... హమాలి పనికూడా మంచి ఉపాధి అని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమాలి పని కంటే మించిన పని ఏముంది అంటూ మాట్లాడారు.

 దీంతో నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి స్థాయిలో ఉండి హమాలీ పని కూడా ఉపాధి అని అంటే అలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే మంత్రులే ఇలా ప్రజాక్షేత్రంలో నోరు జరుగుతుండడంతో గులాబి బాస్ కు అసలు కునుకు లేకుండా పోతుందంట. ఇలా వ్యాఖ్యలు చేయడం పై ఈ మంత్రులపై సీఎం కేసీఆర్ కూడా బాగా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: