మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా పెట్టడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజీనామా కారణంగా హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఆయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కీలక నేతలంతా హుజురాబాద్ ఎన్నికల పై ఫోకస్ పెట్టారు.
ప్రజలను లోబర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఈ ఎన్నికల్లో విజయం సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... ఈ ఉప ఎన్నికలో.. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గా ఫైనల్ అయినట్లే కనిపిస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ, మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలాల్సి ఉంది. ఇక కౌశిక్ రెడ్డి... వ్యవహారంతో హుజురాబాద్ ఎన్నిక మరింత వేడెక్కింది. అయితే.. కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని కూడా కౌశిక్ రెడ్డి వర్గం అంటున్నది. కానీ గులాబీ బాస్ కౌశిక్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా.. మరో బలమైన నాయకుని కోసం వ్యూహాలు రచిస్తున్నారని టాక్. ఆ లిస్టులో... మొదటగా... బీజేపీ నేత పెద్దిరెడ్డి. ఆయన అయితేనే... టీఆర్‌ఎస్ పార్టీ విజయం సులువు అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈటల రాజేందర్ రాక ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డిని ఎలాగైనా... టీఆర్‌ఎస్ పార్టీలోకి లాగాలని... అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ ఆయన పార్టీలోకి రాకపోతే... కౌశిక్ రెడ్డి లేదా... హుజురాబాద్ లోని టీఆర్‌ఎస్ లీడర్లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే..ఈ హుజురాబాద్ నియోజక వర్గంలో ఎవరికి గులాబీ బాస్ బీ ఫామ్ ఇస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.