టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్... తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే గులాబీ అధినేత రసమయి బాలకిషన్ కు... టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మరి గెలిపించారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి... తనదైన శైలిలో రసమయి బాలకిషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్... ప్రజాకవిగా ఉద్యమంలో తనదైన ఆ పాత్రను పోషించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత... 2014 మరియు ముందస్తు ఎన్నికలు జరిగినా 2018 లోనూ రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ రెండు పర్యాయాలు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దీంతో ఉద్యమ నేతగా, ప్రజా గాయకుడిగా మంచి పేరున్న రసమయి బాలకిషన్ కు మానకొండూరు నియోజకవర్గం ఎదురు లేకుండా పోయింది. అయితే కొన్ని రోజులుగా బాలకిషన్ పై చాలా ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో రసమయి బాలకిషన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని... త్వరలోనే ఈటెల అడుగుజాడల్లోనే వెళ్లనున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ రసమయి బాలకిషన్ మరోసారి అరుదైన గౌరవం కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయి బాలకిషన్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గులాబీ బాస్ కెసిఆర్ నిర్ణయంతో చైర్మన్ పదవి లో మరో మూడేళ్ల పాటు రసమయి బాలకిషన్ కొనసాగనున్నారు. అయితే దీనిపై స్పందించిన రసమయి బాలకిషన్... ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తన పైన ఉంచిన విశ్వాసాన్ని... ఒమ్ము చేయబోనని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా పార్టీ అభివృద్ధికి పాటు పడతానని కూడా స్పష్టం చేశారు బాలకిషన్.
కాగా... సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయంతో... రసమయి బాలకిషన్ పార్టీ మారుతున్నాడనే వార్తలకు చెక్ పడ్డట్లయింది.