తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

Veldandi Saikiran
తెలుగు దేశం పార్టీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన... తెలుగు దేశం...బీసీలకు అండగా నిలిచింది. ప్రజా సిద్ధాంతాల కారణంగా పలు సార్లు అధికారం కూడా అందుకుంది తెలుగు దేశం. అయితే.. అలాంటి టీడీపీ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పార్టీ నుంచి కీలక లీడర్లు... అధికార పార్టీలోకి జంప్‌ చేయగా... తాజాగా   తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ కూడా రెండు రోజుల కింద పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు... టీఆర్‌ఎస్‌ చేరుతున్నట్టు ప్రకటించేశారు. 


దీంతో ఇపుడు టీడీపీ పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. ఇక ఖాళీ అయిన టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీలో చాలామంది నాయకులు తలోదారి చూసుకున్నారు. మిగిలింది కొంతమంది నాయకులే. అందులో ఎవరిని అధ్యక్షున్ని చేస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక అటు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గాలేదు. ప్రస్తుతం కొంతమంది నాయకులు మాత్రమే టీడిపిలో ఉన్నారు. పైగా క్యాడర్ అంతా ఎవరి దారి వారు చూసుకున్నారు. 


ఎల్.రమణ వెళ్ళిపోవటంతో.. ఇక   మిగిలిన కొంతమంది నాయకుల్లో... రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్‌ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డిల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతను కట్టబెట్టే అవకాశముంది. అలాగే మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలున్నాయి.  అయితే ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోవచ్చనే వాదనలు వినిపస్తున్నాయి. ముందు గా ముగ్గురితో కోఆర్డినేషన్ కమిటీ వేయొచ్చని అంటున్నారు.  అయితే.. దీనిపై తెలుగు దేశం పార్టీ  అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం అందుతోంది.     
కాగా.... తెలంగాణా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: