రేవంత్‌రెడ్డికి కొత్త పేరు పెట్టిన రోజా... పంచ్ పేలిందిగా..!
రేవంత్ రెడ్డి టిడిపి కోవర్టుగా కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. టిడిపి గురువులైన రామోజీరావు , రాధాకృష్ణ లను కలుస్తున్న ఆయన తన మీద నిందలు వేస్తే ఊరుకోను అని విమర్శించారు. ఇక తెలంగాణ బిజెపి నాయకులు సైతం తనపై ఇదే విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇక కేసీఆర్ గతంలో తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు రోజా ఇంటికి వెళ్లి మరీ భోజనం చేశారు. దీనిపై కూడా అప్పట్లో రకరకాల విమర్శలు వచ్చాయి.
దీనిపై కూడా రోజా స్పందించారు. తమిళనాడులో దేవుడి దర్శనానికి వెళుతూ మధ్యలో తన నగరి నియోజకవర్గం ఉండడంతో కేసీఆర్ గారు గౌరవార్ధం మా ఇంటికి వచ్చారని.. అప్పుడు జగన్ మా ఇంట్లో ఎందుకు ఉంటారని ? దీనిని భూతద్దంలో పెట్టి చూపించడం కరెక్ట్ కాదని ఆమె విమర్శించారు.
బీజేపీ నాయకులు ఇలాంటి విమర్శలు ఆపి.. పునర్విభజన చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రధాన మోడీని విమర్శించడం చేతకాని బీజేపీ నాయకులు తనపై విమర్శలు మానుకోవాలన్నారు.
ఏదేమైనా రేవంత్ రెడ్డిని రోజా కోవర్టు రెడ్డి అని విమర్శించడంతో ఇది ఇప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్ వాళ్లు వైరల్ చేస్తున్నారు. మరి దీనికి రేవంత్ నుంచి ఎలాంటి రిటాక్ట్ ఉంటుందో ? చూడాలి.