టాయిలెట్ వాడితే.. అకౌంట్ లోకి డబ్బులు?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీతో కూడిన వస్తువులను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అధునాతన ఆవిష్కరణలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. దేనికి పనికి రావు అన్న పదార్థాలలో కూడా దేనికో ఒక దానికి పనికి వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేసీ సక్సెస్ అవుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంట్లో పనికి రాదు అని పడేసే చెత్తను సైతం రీసైక్లింగ్ చేసి ఉపయోగిస్తున్న ఘతనలు కూడా ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చాయి.



 అయితే కేవలం వస్తువులు లాంటివి మాత్రమే కాదు ఇక మనిషి వ్యర్థాలతో కూడా ఉపయోగం ఉంటుంది అని ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. నేటి నాగరిక సమాజంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం లాంటివి నిషేధం. ఈ క్రమంలోనే ఇక అక్కడక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్ళిన సమయంలో వారికి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చిన తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇక ఎవరైనా సరే ఇలా కొంత మొత్తంలో నగదు చెల్లించిన తర్వాత టాయిలెట్స్ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్.. టాయిలెట్స్ ఉపయోగించుకున్నారు అంటే మీకే కొంత మొత్తంలో క్యాష్ ఇస్తారు.



 టాయిలెట్స్ ఉపయోగించుకున్న వారికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి జోక్ వేస్తున్నారు కదా అంటారా..జోక్ కాదు ఇది నిజంగానే.. దక్షిణ కొరియా ఉల్సన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లోనే ది బేవి టాయిలెట్ వాడిన వారికి ఈ విధంగా రిటర్న్ డబ్బులు ఇస్తూ ఉంటారట. అయితే ఇది మానవ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటుందట. దీనిని ప్రొఫెసర్ జై ఊన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. మానవ వ్యర్థాలను కొన్ని సూక్ష్మ జీవులు సాయంతో మిథన్ గా మార్చి కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇక 50 లీటర్ల మిథన్ 0.5 కేవి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుందట. ఇలా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత అక్కడి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఇక అకౌంట్ కి డబ్బులు వస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: