ముఖ్యమంత్రి జగనువీ ఇన్ని మోసపు లెక్కలు ఉన్నాయా..?

MOHAN BABU
ఎన్ఎస్ఎఫ్డిసి నిధులను నవరత్నాలకు మళ్లించే హక్కును జగన్ కు ఎవరిచ్చారని వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని ఆయన అన్నారు. అలాగేరాజ్యాంగ పరంగా గిరిజనులకు, దళితులకు కేంద్రం నుండి వచ్చే నిధులను సైతం వైయస్సార్ పేరు తగిలించి తానే చేసినట్టు డబ్బా కొట్టుకుంటున్నాడని ఇలాంటి పనులను ముఖ్యమంత్రి మానుకోవాలని తెలిపారు.  ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 4341 కోట్ల రూపాయలు,  ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి 662 కోట్ల రూపాయలను ఒక అమ్మఒడికే దారి మళ్లించి  ప్రజలను మోసం చేస్తున్నా డన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ నిధులతో  దళితులకు స్వయం ఉపాధి కల్పించాలని, జగన్ రెడ్డి మాత్రం ముష్టి వేసినట్లు   విసురుతున్నారని ప్రశ్నించారు.


చంద్రబాబు నాయుడు హయాంలో దళితులకు ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, జెసిబి వాహనాలు ఇచ్చి వారిని వారిని ఆదుకున్నమని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ జెసిబిలతో కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కార్పొరేషన్లకు ఇప్పటివరకు ఒక్క లోను కూడా ఇవ్వలేదని ఈ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం  అధి కారంలో ఉన్నప్పుడు  2018-19 సంవత్సరం బడ్జెట్  కేటాయింపులలో ఎస్సీ వర్గాల అభివృద్ధికి  14,367 కోట్ల రూపాయలు కేటాయించి 90 శాతం నిధులు ఖర్చు చేశామని చెప్పారు.  కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 15 వేల కోట్లు మాత్రమే  కేటాయించి ఖర్చు చేసింది కేవలం 4,700 కోట్ల రూపాయలని  ఇక ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.

2020-21 సంవత్సరం బడ్జెట్ లో కూడా  ఎస్సీ అభ్యున్నతికి 15,735 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి, నవర త్నాలకు కేటాయించిన 7525 కోట్ల రూపాయలను కలిపి చూపిస్తూ అబద్ధపు మాటలతో మాయల పకీర్ లెక్కలు చెబుతున్నాడని కడిగి పారేసాడు.  జగన్మోహన్ రెడ్డి చూపించే మోసపు లెక్కలని చూసి మోస పోవడానికి దళితులు ఎవరు సిద్ధంగా లేరని,  తిరగబడి ప్రశ్నిస్తారని అన్నారు. అలాగే దళితులకు చట్టపరంగా రావాల్సిన నిధులను ప్రభుత్వం అందిస్తున్నట్లు పేర్లను తగిలించడం మానుకొని కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని తరుణంలో దళితులంతా ఏకమై ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితులకు కావలసినటువంటి హక్కులను వారికే అందించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: