కోలుకున్న అయ్యర్.. కెప్టెన్సీ పగ్గాలు దక్కేనా?
అక్కడ వరుసగా సిరీస్లు ఆడింది టీమిండియా. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో ఇక టీమిండియా లో కీలక ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ భుజం గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత గాయం తీవ్రం కావడంతో మళ్లీ ఇక జట్టుకు అందుబాటులో ఉండలేకపోయాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ప్రారంభం కావడంతో శ్రేయస్ అయ్యర్ కు బదులుగా ఢిల్లీ జట్టు కెప్టెన్సీని రిషబ్ పంత్ అప్పజెప్పింది యాజమాన్యం. ఇక అటు రిషబ్ పంత్ కూడా తన కెప్టెన్సీ తో బాగానే రాణించాడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ అందరిని సంతృప్తి పరిచాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ గాయం బారి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.
మొన్నటివరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇటీవల తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. యూఏఈలో జరగబోయే రెండవ దశ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేందుకు సిద్దం గా ఉన్నాను అంటూ శ్రేయస్ అయ్యర్ ప్రకటించారు. అయితే శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు పంత్ కి అప్పగించిన యాజమాన్యం ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయ్యర్ గాయం నుంచి కోలుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను బాధితులను అయ్యర్ కి అప్పగిస్తారా లేదా ఒక అయ్యర్ ను సాదా సీదా ఆటగాడిగా కొనసాగించి కెప్టెన్గా రిషబ్ పంత్ నే కొనసాగిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.