వెరైటీ పెళ్లి.. అతిథులతో ప్లేట్లు కడిగించి?
ఎందుకు అంటారా.. ఇక్కడ కూడా అని పెళ్లిళ్లకు వచ్చినట్లుగానే భారీగా బంధుమిత్రులు అందరూ వచ్చారు. కానీ అక్కడ వచ్చిన అతిథులకు మాత్రం కనీస మర్యాద లేకుండా పోయింది. ఏ పెళ్లి లో నైనా అతిథులందరికీ కడుపునిండా విందు ఆరగించేలా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రం అతిథులకు తిండి పెట్టడం ఏమో కానీ అక్కడి ప్లేట్లు అన్నింటినీ కూడా పెళ్లికి వచ్చిన అతిథులతో కడిగించి తీవ్రంగా అవమానించారు. దీంతో ఇక అతిథులు షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే అనుకోని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.
ఆ వధువు తమకు దగ్గర బంధువు అని కానీ వరుడు గురించి మాత్రం తనకు ప్రత్యేక తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి చేసుకోవడానికి ఖరీదైన వేదికను అద్దెకు తీసుకుని ఎంతో అద్భుతంగా అలంకరించారు అంటూ ఆ మహిళా చెప్పుకొచ్చింది. ఇంటికి వచ్చిన అతిథులకు మంచి బఫిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొంత మంది అతిథులు భోజనం చేశారో లేదు పూర్తిగా భోజనం అయిపోయింది. ఇక ఆ తర్వాత మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. అక్కడికి వచ్చిన అతిథులందరికీ ఏకంగా గిన్నెలు కలిగించడం ఎంతో బాధేసింది అంటు ఆ మహిళా చెప్పుకొచ్చింది. మహిళ చేదు అనుభవం గురించి తెలుసుకున్న నేటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.