నీతి అయోగ్ జాబితాలో బసవతారకం.. !

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌ముఖ న‌టుడు, దివంగ‌త‌ నంద‌మూరి తార‌క‌రామారావు ఆయ‌న స‌తీమ‌ణి పేరిట హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేశారు. ఈ హాస్పిట‌ల్ క్యాన్స‌ర్ రోగుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్సాల‌యంగా బ‌స‌వ‌తార‌కం గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా లాభాపేక్ష లేని ఆస్ప‌త్రిగా నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి చేర్చింది. ఇక ఇదే నివేదిక‌లో పుట్ట‌ప‌ర్తి వైద్యాల‌యానికి కూడా గుర్తింపు ద‌క్కింది. మొత్తం 500ప‌డ‌క‌ల బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి సొంతంగానే నిధులను స‌మ‌కూర్చుకుంటోంది. అంతే కాకుండా మూల‌ధ‌న వ్య‌యం కోసం గ్రాంట్ ల‌పై ఆధార‌ప‌డుతోంది. 

అయితే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సూచించింది. అంతే కాకుండా పుట్ట‌ప‌ర్తి ట్ర‌స్ట్, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు 100 శాతం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని నీతి అయోగ్ పేర్కొంది. ఇలాంటి లాభాపేక్ష లేని ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వాల రియంబ‌ర్స్మెంట్ వెంట‌నే ఇవ్వాల‌ని ప్ర‌స్థావించింది. పేద, బ‌డుగులకు నాణ్య‌మైన సేవ‌లందిస్తున్న ఆస్ప‌త్రులుగా ఈ రెండు ఆస్ప‌త్రుల‌కు నీతి అయోగ్ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సంద‌ర్భంగా రామారావు కుమారులు నంద‌మూరి రామ‌కృష్ణ, బాల‌కృష్ణ ఆనందం వ్య‌క్తం చేసారు.

నంద‌మూరి సోద‌రులు మాట్లాడుతూ....బసవతార‌కం ఇండో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు నీతి అయోగ్ జాబితాలో చేర‌డం ప్ర‌తిష్ఠాత్మ‌క గుర్తింపని అన్నారు. ఆదర్శప్రాయమైన సేవ మ‌రియు దేశ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సంరక్షణకు ఆస్ప‌త్రి చేసిన కృషికి ఫ‌లింతం ద‌క్కింద‌ని వ్యాఖ్యానించారు. దేశానికి ఆస్ప‌త్రి వ‌ర్గాలు చేసిన త్యాగం ఎంతో గొప్ప‌దని వ్యాఖ్యానించారు. మొత్తం ఆస్ప‌త్రి టీమ్ కు వందనాలు తెలిపారు. బ‌సవతారకం కుటుంబంలోని ప్రతి సభ్యునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న త‌మ‌ శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని తెలుపుతున్నామ‌ని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల‌తో పోలిస్తే బ‌స‌వ‌తారకం త‌క్కువ ఫీజు వ‌సూలు చేస్తోందని చెప్పారు. 2000 సంవ‌త్స‌రంలో బ‌స‌వ‌తార‌కం ప్రారంభం 15 ఏళ్ల‌లో 1,65,000 మంది క్యాన్స‌ర్ రోగుల‌ను ప‌రీక్షించిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: