మళ్ళీ డ్రోన్లు దొరికాయి.. భారత్ ఏం చేస్తుందో?

praveen
ఇటీవలే అంతర్జాతీయ సరిహద్దు కు 14 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బేస్ ఫై డ్రోన్లు దాడి  చేయడం సంచలనం గా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా భారత్లో డ్రోన్ల దాడి కలకలం సృష్టించింది.  డ్రోన్ల దాడి గురించి మరవకముందే మరికొన్ని ప్రాంతాలలో కూడా డ్రోన్లు దాడి చేసేందుకు రావడం సంచలనంగా మారిపోతుంది. అయితే మొదటి రోజు డ్రోన్లతో దాడి చేసిన తర్వాత..  మరుసటి రోజు కూడా ఇక 2 డ్రోన్లు దాడి చేసేందుకు రావడంతో సైన్యం అప్రమత్తమై డ్రోన్ లపై దాడులు జరిపింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాయ్ .  ఇలా డ్రోన్లతో దాడి కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిన నేపథ్యంలో ఇక ఇటీవల నేపాల్ సరిహద్దుల్లో కూడా డ్రోన్లు బయట పడడం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది.



 అయితే కాశ్మీర్లో ఉన్న ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఎవరు అనేది తెలుసుకునే పనిలో పడింది సైన్యం. ఇలాంటి సమయంలో ఇటీవల నేపాల్ సరిహద్దుల్లో  ఇటీవల డ్రోన్లతో దొరికిపోయాయ్.  ఇండియా నేపాల్ సరిహద్దుల్లోకి వచ్చినటువంటి  చైనా కు సంబంధించిన డ్రోన్లను పట్టుకున్నారు సైన్యం.  ఒక్కసారిగా డ్రోన్లు దొరకడం సంచలనంగా మారింది. అయితే యుద్ధంలో విధ్వంసం సృష్టించేందుకు ఉపయోగించినట్లు కాకుండా.. మినీ డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.



 ఒక సాదాసీదా డ్రోన్ కి పేలుడు పదార్థాన్ని పెట్టి అతి తక్కువ ఖర్చుతో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే కాశ్మీర్ పై జరిగిన దాడి కలకలం సృష్టించగా.. ఇప్పుడు భారత్-నేపాల్ సరిహద్దులో చైనా కు సంబంధించిన డ్రోన్లు దొరకడం మరింత సంచలనంగా మారింది. ఈ డ్రోన్ ల వెనుక కథ ఏంటి..  కారణం ఏంటి అని శర వేగంగా విచారణ జరిపి తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుతం సైన్యంపై ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.  ఇప్పటికే భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల భారత్-నేపాల్ సరిహద్దులో చైనా కు సంబంధించిన డ్రోన్లు దొరకడం  మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: