ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి ఖాయమైందా?

praveen
మరికొన్ని రోజుల్లో ఏపీలో మంత్రివర్గ విస్తరణ కు సంబంధించిన కార్యాచరణ మొదలు కాబోతుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. రెండున్నర సంవత్సరాల తర్వాత కేబినెట్లో మార్పులు ఉంటాయని.. ఇప్పుడు మంత్రి పదవులు పొందిన వారి పనితీరు ఆధారంగా.. ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తామని.. కొత్తవారికి అవకాశం కల్పిస్తామని గతంలో క్యాబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు.

 2019 లో ఘన విజయం సాధించిన సీఎం జగన్ ఇటీవల రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పడంతో ఇక మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలు కాబోతుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో ఎంతో మంది మంత్రి పదవులు ఆశించి నిరాశ చెందారు. ఎవరూ ఊహించని వ్యక్తులకు మంత్రి పదవులు దక్కాయి. మంత్రి పదవి ఆశించే నిరాశ చెందిన వారిలో కీలక నేతగా ఉన్న రోజా కూడా ఉన్నారు. ఇక రెండవసారి మంత్రివర్గ విస్తరణలో నగరి ఎమ్మెల్యే రోజా కు మంత్రి పదవి దక్కడం ఖాయమని టాక్ వినిపిస్తోంది  .  అయితే మొదటి నుంచి జగన్ వెన్నంటే ఉన్న రోజాకి  మొదట్లోనే మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు అందరు.

 కానీ రోజాకి మంత్రి పదవి మాత్రం వరించలేదు. దీనితో అసంతృప్తి చెందిన రోజా కొన్నాళ్లపాటు పార్టీలో సైలెంట్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక మంత్రి పదవి హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. అయినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు అన్న నిరాశ ఉన్న నేపథ్యంలో ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపడితే ఇక రోజా కి చాన్స్ దక్కడం ఖాయమని అటు రోజా సన్నిహిత వర్గం నుండి టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహుల ఎక్కువగానే ఉన్నారు. మరి సీఎం జగన్ ఈసారైనా రోజాకి మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: