కోమటిరెడ్డికి ఇంత అవమానమా... !
ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో ఇందుకు బాధ్యులు అయిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మంగళవారం భువనగిరి లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం కూడా చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిసి తన నియోజకవర్గంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తనకు ప్రొటోకాల్ పరంగా జరిగిన అన్యాయంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక కోమటిరెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. త్వరలోనే తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేదా కోమటిరెడ్డి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పదవి వస్తుందనే అంటున్నారు. కోమటిరెడ్డికి పార్టీలో సీనియర్ల సపోర్ట్ ఉంది. పార్టీలో సీనియర్ కావడంతో పాటు అందరిని కలుపుకుని పోవడం.. ఇటు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ గా ఉండడం ఆయనకు ప్లస్ కానున్నాయి. మరి కోమటి రెడ్డి లక్ ఎలా ? ఉం దో ? చూడాలి.