జూడాల‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం...!

జూనియ‌ర్ డాక్ల‌ర్లు స‌మ్మెను విర‌మించికున్నారు. నేడు ఆరోగ్య శాఖ మంత్రితో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అవ్వ‌డంతో వారు స‌మ్మెను విర‌మించుకున్నారు. ఈ చ‌ర్చ‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల‌నాని, డాక్టర్ రాఘవేంద్రరావు, అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం డాక్టర్ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... జుడాల సమ్మె నేపధ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 45వేల నుండి 70వేలకు స్టైఫండ్ పెంచారని తెలిపారు. కరోనా తో మరణించిన వైద్యులకు 25లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిపారు. 
విధుల్లో ఉన్న వైద్యులు కు భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఓకే చెప్పింద‌ని తెలిపారు. ఇన్సెంటీవ్స్ విషయంలో సిఎం తో చర్చించి నిర్ణయం చేయాల్సి ఉందన్నారు. స్టైఫండ్ ను విడతల వారీగా పెంచుతామని ఆళ్ల నాని హామీ ఇచ్చారని తెలిపారు. జూనియర్ డాక్టర్ లు కూడా హర్షం వ్యక్తం చేస్తూ... విధులకు హాజవుతామని చెప్పారని అన్నారు. జనవరి 2020లో జుడాలకు స్టైఫండ్ పెంచామ‌ని అన్నారు. పే రివిజన్ వచ్చే జనవరిలో ఉంటుంది.. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదన్నారు.
చ‌ర్చ‌ల అనంత‌రం జూనియ‌ర్ డాక్ట‌ర్ అచ్యుత్  మీడియాతో మాట్లాడుతూ.......మా డిమాండ్ ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కోవిడ్ వల్ల చనిపోయిన వైద్యులు కు 25లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కరోనా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. భద్రతా పరమైన భరోసా కు సంబంధించి జిల్లా కలెక్టర్ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామన్నారు. స్టైఫండ్ ను ఆరు నెలల్లో పెంపును అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ల కు కూడా స్టైఫండ్ పెంచారు. కరోనాతో మరణించిన‌ యువ వైద్యురాలు సీమా కుటుంబానికి మూడు రోజుల్లోపు 25 లక్షలను అందిస్తామని హామీ ఇచ్చారు. టిడియస్ విషయంలో ఇతర రాష్ట్రాలలో పరిశీలించి నిర్ణయం చేస్తామన్నారు. కోవిడ్ ఇన్సెంటీవ్స్ విషయాన్ని సిఎం దృష్టి కి తీసుకెళ్లి పరిశీలన చేస్తామన్నారు. స్టైఫండ్ ను విడతల వారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మా డిమాండ్ ల పై సానుకూలంగా స్పందించడంతో స‌మ్మెను విర‌మిస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: