చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

praveen
ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్న, పరిగెత్తుతున్న, తింటున్న తినకపోయినా ఇలా ప్రతీ సమయంలో కూడా సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో అయితే సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే బాత్ రూమ్ కి వెళ్ళినా చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వెళుతున్నారు.  అంతలా సెల్ఫోన్ మనుషులను బానిసలుగా మార్చేసుకుంటుంది. ఒకప్పుడు సెల్ఫోన్ అంటే జీవితంలో ఒక అవసరంగా మాత్రమే ఉండేది.



 కానీ నేటి రోజుల్లో మాత్రం సెల్ఫోన్ జీవితం గా మారిపోయింది. ముఖ్యంగా నేటి రోజుల్లో చిన్న పిల్లలు సైతం ఎక్కువగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తూ ఉన్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఒక్క క్షణం చేతిలో స్మార్ట్ఫోన్ లేదు అంటే ఇక రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే సాధారణంగా పెద్దవాళ్లే స్మార్ట్ఫోన్ ఎక్కువసేపు వాడటం ఏ మాత్రం మంచిది కాదు అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. ఇక అలాంటిది చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం  అస్సలు వద్దు అని హెచ్చరిస్తున్నారు.  అయితే చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వద్దు అని నిపుణులు హెచ్చరించడం వెనక పెద్ద పెద్ద కారణాలే ఉన్నాయి.



 అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్న పిల్లలు ఎక్కువసేపు ఒకేచోట కూర్చొని స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ ఉంటారు.. అలా చేయడం ద్వారా వారిలో శారీరక కదలికలు తగ్గుతూ ఉంటాయి. ఇది ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఫోన్ కి ఎక్కువగా అలవాటు పడితే ఇక ఏదైనా సమయంలో ఫోన్ లేదు అంటే చాలు పిల్లలు అసహనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు పిల్లల్లోని క్రియేటివిటీని ఎప్పుడు ఫోన్లు తగ్గిస్తాయి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని ఫోన్లు వినియోగించడం ద్వారా ఊబకాయం సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ లోనే ఎక్కువ కాలం గడపడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తగ్గుతాయి అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: