పెళ్ళికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి?
కరోనా వైరస్ కాలంలో కూడా సరైన ముహూర్తాన్ని ఉంటే చాలు పెళ్ళికి సిద్ధమైపోతున్నారు. బంధు మిత్రులందరూ రాకపోయినప్పటికీ వచ్చినవాళ్లు చాలులే అనుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాలు చేసుకుంటున్నారు. అయితే తమకు కావాల్సిన వారికి కొంత మందికి పెళ్లి ఆహ్వానాలను కూడా అందిస్తున్నారు. ఆహ్వానం అందిన తర్వాత ఏం చేస్తాం ఇక వెళ్లక తప్పదు కదా అని ఎంతోమంది మొహమాటానికి ఆ పెళ్ళికి వెళ్తున్నారు. ఇలా పెళ్లిళ్లకు వెళ్లే వారికి అధికారులు కొన్ని రకాల జాగ్రత్తలు సూచిస్తున్నారు. చాలా దగ్గర వాళ్ళ పెళ్లి... వెళ్లక తప్పదు అంటేనే వెళ్ళండి తప్పా.. మొహమాటానికి మాత్రం పెళ్లికి వెళ్లి సమస్యలు తెచ్చుకోవద్దు అని సూచిస్తున్నారు నిపుణులు.
పెళ్లి కి వెళ్లిన సమయంలో జాగ్రత్తలు కాదు అతి జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమం అని చెబుతున్నారు. ముఖ్యంగా నోరు ముక్కు కవర్ చేసే విధంగా మీరు ధరించిన మాస్క్ ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక సాధారణంగా పెళ్లిళ్లలో ఆలింగనాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం వాటికి పూర్తిగా దూరంగా ఉండడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా పెళ్లి లో ఏదైనా వస్తువును ముట్టుకున్నారు అంటే వెంటనే చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. పెళ్లి తర్వాత భారాత్ కూడా కాస్త దూరంగా ఉండటమే మంచిది అని అంటున్నారు నిపుణులు.