గుడ్ న్యూస్ : 12 ఏళ్ళ వయస్సు వారికీ కూడా వ్యాక్సిన్?

praveen
మొత్తం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన వైరస్ మధ్యలో కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ శర వేగంగా మళ్ళీ వ్యాప్తి చెందుతూ అందరిని బెంబేలెత్తిస్తోంది. దీంతో రోజురోజుకు ప్రజలందరిలో భయం నిండిపోతుంది. అగ్రరాజ్యాల సైతం ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితేనే వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం కొన్ని దేశాలలో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ..  మరికొన్ని దేశాలలో మాత్రం వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.  ఇలాంటి సమయంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతూ ఉండడం అందరిలో మరింత ధైర్యం వచ్చింది అని చెప్పాలి.



 ఇకపోతే ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకా అందించేందుకు వివిధ రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి.  18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా టీకా అందించే ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నాయ్ అన్ని దేశాల ప్రభుత్వాలు. కానీ మహమ్మారి వైరస్ చిన్న పిల్లల పై కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి టీకా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ఎక్కువవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో అందరూ ఆందోళన చెందుతున్నారు.  ఇక ఇప్పుడు ఏకంగా 12 నుంచి 15 సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక టీకా తయారయింది.



 ఫైజర్ బయో ఎన్ టెక్ సంయుక్తంగా తయారుచేసిన టీకా ను ప్రస్తుతం 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు అందించేందుకు ఎఫ్ డి ఎ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.  వైరస్ నియంత్రణలో ఇది కీలక దశ అంటూ ఎఫ్ డి ఎ అధికారులు తెలిపారు.  అయితే రెండు వేల మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా చిన్నపిల్లలపై ఈ టీకా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.  అన్ని రకాల వివరాలను పూర్తిగా సమీక్షించిన తర్వాత టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చినట్లు ఎఫ్ డియే అధికారులు తెలిపారు. అయితే అంతకుముందు కెనడా హెల్త్ కూడా ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: