కరోనా భయంతో అలా చేస్తే.. క్యాన్సర్ వస్తుంది జాగ్రత్తా.?

praveen
మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా ప్రజలందరినీ వణికిస్తోంది . మహమ్మారి భయం ప్రజలలో రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం ప్రజలందరిలో కరోనా వైరస్ పై పూర్తి స్థాయి అవగాహన వచ్చిన నేపథ్యంలో చిన్నచిన్న లక్షణాలు కనిపించిన కూడా ఇక తమకు కరోనా వైరస్ సోకిందేమో అని భావించి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు జనాలు.  ఈ క్రమంలోనే  ఆస్పత్రిలు అన్నీ కూడా ప్రస్తుతం జనాలతో నిండిపోతున్నాయి. అయితే కొంతమంది అయితే అవసరం లేకున్నప్పటికీ కూడా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు.



 మరికొంతమంది రాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ అని వచ్చినప్పటికీ ఇంకా నమ్మకం కుదరక హాస్పిటల్ లోకి వెళ్లి సిటీ స్కాన్ చేసుకుంటున్నారు. దీని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు అని చెప్పాలి.  అయితే ఈ మధ్య కాలంలో ఇలా సిటీ స్కాన్ చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువైన నేపథ్యంలో ఇటీవల ఇలాంటి వారిని హెచ్చరించారు ఎయిమ్స్ డైరెక్టర్ రనదీప్ గులేరియా  . సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించారు.  ఒక్క సిటీ స్కాన్ 300 చెస్ట్  ఎక్స్ రే తో సమానం అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే సిటీ స్కాన్ తరచూ తీసుకోవడం వల్ల ఏకంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఆయన హెచ్చరించారు




 ముఖ్యంగా యువతలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచించారు రణదీప్ గులేరియా. సిటీ స్కాన్ లో కొన్ని రకాల ప్యాచ్ లు కనిపిస్తాయని అలాంటివి ఎలాంటి చికిత్స లేకుండానే నయమవుతాయని ఆయన చెప్పుకొచ్చారు.  లక్షణాలు లేని వాళ్ళకి కూడా సిటీ స్కాన్ లో పాజిటివ్ అని వస్తుందని అందుకే ముందుగా ఎక్స్రే తీయించుకున్న తర్వాత సిటీ స్కాన్ కి వెళ్లాలా వద్దా అన్నది డాక్టర్లు డిసైడ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. కానీ అనవసరంగా భయాందోళనకు గురై సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా చివరికి ఎంతో ముప్పు పొంచి ఉంది అంటూ ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: