వైరల్ వీడియో : చిన్నారికి కరోనా.. కంటతడి పెట్టిస్తున్న తల్లి ఆవేదన..?

praveen
రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగి పోవడం ఏమో కాని తెరమీదికి వస్తున్న ఘటనలు మాత్రం అందరినీ కలిచివేస్తున్నాయి.. కరోనా వైరస్  మహమ్మారి శరవేగంగా వ్యాప్తిచెందుతూ పంజా విసురుతుంటే  ఎంతోమంది తమ ప్రియమైన వారిని దూరం చేసుకుంటూ చివరికి తీరని శోకంలో మునిగిపోతున్నారు.  ఒక భార్య భర్త ప్రాణాలు కాపాడడం కోసం..  భర్త తన భార్య ప్రాణాలు పోకుండా చూడటం కోసం... ఒక తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని వదల లేక తన పిల్లలను కాపాడుకోవడానికి  పడుతున్న ఆరాటం ఎంతో మందీని కంట నీరు పెట్టిస్తుంది.  ఇప్పుడు వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో విషాదకర ఘటనలు పెరిగిపోతున్నాయి.



 ఇప్పటికే కరోనా వెలుగు లోకి వచ్చి ఎంతో మంది జీవితాలను దుర్భరం స్థితిలో పడేసింది. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి తీసుకు వచ్చింది. ఇక బ్రతకడం కంటే చాచావటం లా మేలు అనే పరిస్థితి తీసుకు వచ్చింది కరోనా వైరస్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారూ పక్కనే ఉన్నారు అన్న సంతోషంతో ఉంటే ఇక ఆ ప్రియమైన వారిని కూడా దూరం చేస్తూ చివరికి ఈ బ్రతుకు వృధా అనే పరిస్థితిని కనికరంలేని కరోనా. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు ఎంతో మంది హృదయాలను కలచివేస్తున్నాయి.  ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చి అందరిని కలిచి వేసింది.



 తమకు బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోష పడి పోయారు. కానీ సవంత్సరంన్నర కూడా గడవకముందే కరోమా వైరస్ కాస్త వారి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది అని మాత్రం ఊహించలేకపోయారు.  చిన్నారి కూతురు  వైరస్ బారినపడగా కూతుర్ని కాపాడాలి అంటూ తల్లి పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తుంది. 16 నెలలు కూతురికి  పాజిటివ్ అనగానే ప్రైవేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టారు తల్లిదండ్రులు అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో కేజీహెచ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ కూడా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆ తల్లి మనసు అల్లాడిపోయింది చావుబతుకుల్లో ఉన్న తన కూతురు ని రక్షించండి అంట డాక్టర్ ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు చివరికి చావుతో పోరాడిన ఆ చిన్నారి కన్నుమూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: