వాట్సాప్ అద్దిరిపోయే ఫీచర్.. ఇక ఆ మెసేజ్ లు కనిపించవు..?
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు నేటి రోజుల్లో ఎంతోమంది వాట్సాప్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు పక్కన ఉన్న మనుషులతో కాకుండా ఇతరులతో వాట్సాప్ లో మెసేజ్ చాటింగ్ చేయడం ఎవరినైనా కలవాలి అనిపిస్తే వీడియో కాల్ ద్వారా కలవడం ఇలా పూర్తిగా వాట్సాప్ లోనే మునిగిపోతుంది నేటి రోజుల్లో లోకం మొత్తం. వాట్సాప్ రోజురోజుకు తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ దూసుకుపోతుంది అయితే తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందించడంలో కూడా ఎప్పుడూ వాట్సాప్ ముందు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు
ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుంది. ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ కస్టమర్ లు ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు ఇక ఆ మెసేజ్ ఎంత వరకు ఇతరులకు కనిపించాలి అన్నది టైం సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక 24 గంటల వరకు మాత్రమే మీరు పంపించిన మెసేజ్ కనిపిస్తుంది ఆ తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది అయితే ఈ సరికొత్త టీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉందని త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ తెలిపింది.