చావులోనూ వీడని మూడుముళ్ల బంధం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి..?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరుగా ఉంటుంది...  ఒకసారి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు అంటే ఇక కొన ఊపిరి వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా  ఉంటారు..  వేదమంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదం లతో ఒకటైన దంపతులు..  ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం అనురాగం కలిగి ఉంటారు. ఎలాంటి కష్టం ఎదురైనా ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారు.. అందుకే భార్య భర్తల బంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ మధ్య కాలంలో మాత్రం భార్య భర్తల బంధం లో ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాదు  మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


 ఒకప్పుడు కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత నేటి కాలంలో ఎక్కడా కనిపించడం లేదు అంతేకాకుండా కట్టుకున్న వారి విషయంలోనే దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎంతోమంది. అయితే నేటి రోజుల్లో ఏకంగా పరాయి వ్యక్తుల కోసం కట్టుకున్న వారిని కడ తేరుస్తున్న ఘటనలు తెరమీదికి వస్తున్నాయి ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరినీ ఎంతగానో కలచివేస్తుంది. ఏకంగా ఆ భార్యభర్తలు చావులో కూడా ఒకరికి ఒకరు తోడుగానే ఉన్నారు. భర్త చనిపోయిన కేవలం గంటల వ్యవధిలోనే భార్య కూడా చనిపోవడం అందరినీ కలిచివేసింది



 ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లో వెలుగులోకి వచ్చింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలోనే మృతి చెందారు. మరణంలోనూ వారి దాంపత్య బంధాన్ని వీడలేదు గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఛాతి నొప్పి రావడంతో ఇక అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందారు.  ఈ క్రమంలోనే భర్తే ప్రాణంగా బతికిన భార్య గుండె పగిలినంత పని అయింది అయితే ఇక అతని శవం వద్ద ఉదయం సమయంలో ఇక బంధువులందరూ రోదిస్తూ ఉండగా భార్య ఛాతిలో నొప్పి వచ్చి అక్కడి కుప్పకూలిపోయింది బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా మరణించింది అంటూ నిర్ధారించారు ఇలా గంటల వ్యవధిలోనే దంపతులు ఇద్దరు మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: