జర్నలిస్టు సాయి మరణించారా...ఏపీ మంత్రి విచారం...?

VAMSI
ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు వలన ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. వాస్తవమైన వార్తలను అవాస్తవంగా...అవాస్తవమైన వార్తలను వాస్తవమని పోస్ట్ చేయడం వలన తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎన్నో సార్లు ఇదే విధంగా ఒకరు చనిపోతే..మరొకరు చనిపోయినట్లు చిత్రీకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా జరియుజ్ఞా ఒక సంఘటన వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ జర్నలిస్ట్ సాయి చనిపోయారన్న వార్త అటు టీవీలోనూ వార్తా ప్రత్రికలోనూ రావడంతో సాయి బహిమానులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.  గత రెండు మూడు రోజుల నుండి ఈ విషయమై సాయికి తెలిసిన వారు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా ఆయనకు ఫోన్ చేసి తన యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

అంతే కాకుండా ఏపీ మంత్రి కూడా సాయిని పరామర్శించినట్లు తెలిసింది. వీరందరికీ కూడా నేను బ్రతికే ఉన్నానని జర్నలిస్టు సాయి తెలపడం జరిగింది.  వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాస్తవంగా ఏమి జరిగిందన్నది చూస్తే...జర్నలిస్ట్ సాయి కరోనా కారణంగా చనిపోయారని ఒక మెసేజ్ వాట్సాప్ లో రావడంతో అది కాస్తా సర్క్యూలేట్ అవడంతో ఇదంతా జరిగింది. వాస్తవంగా జరిగిందేమిటంటే విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేస్తున్న సాయి అనే పేరు కలిగిన జర్నలిస్ట్ ఈ మధ్యనే కరోనా కారణంగా చనిపోయాయిరు. ఇతనిని ప్రముఖ జర్నలిస్ట్ సాయి అనుకుని పొరపడ్డారు.

ఇతను సాయి కి కూడా తెలిసిన వ్యక్తి అనే ఆయనే ధ్రువీకరించారు. తీరా అయన మరణించారని తెలిసాక బాధపడ్డానని సాయి తెలిపారు. అయితే ఇదంతా కూడా ఆయన పేరు "జర్నలిస్టు సాయి" అని అనడం వలన జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ పేరుతో కాకుండా తమకు ప్రచారంలో ఉన్న పేరు మూలన జరిగినట్లుగా తెలిపారు...ఈ విధంగా ఈయన నా గురించి ఇంతమంది ఆలోచించే వారు ఉన్నారా అని సన్తసన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఆళ్ల నాని విచారణపై ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇటువంటి వార్తలను సర్క్యూలేట్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి చేయలని హితవు పలికారు జర్నలిస్ట్ సాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: