కృష్ణమ్మతో తోపు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్?

Purushottham Vinay
టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు  సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తన విలక్షణ నటనతో, ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు.అతని సినిమాలలో ఖచ్చితంగా ఏదో ఇంటరెస్టింగ్ విషయం ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు.అయితే సత్యదేవ్ థియేటర్స్ లో ఇప్పటి దాకా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. విభిన్న కథలతో నటుడిగా తనని ప్రూవ్ చేసుకున్నాడు. అవకాశాలు కూడా విరివిగా అందుకుంటున్నాడు. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇప్పటి దాకా రాలేదు. తాజాగా సత్యదేవ్ కృష్ణమ్మ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమాతో ఎలా అయిన ఒక మంచి కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో సత్యదేవ్ ఉన్నాడు. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహారించాడు. ఆయన సమర్పకుడిగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి కృష్ణమ్మ మూవీని నిర్మించారు.


అయితే ఈ సినిమాని కొరటాల శివ దగ్గరుండి ప్రమోట్ చేశారు. మూవీ ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా మొత్తం 3 కోట్ల బిజినెస్ జరిగిందంట. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఖచ్చితంగా 3.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో 2.50 కోట్ల బిజినెస్ కృష్ణమ్మ మూవీ పై జరిగింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పెద్ద చాలెంజ్ ను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఎలక్షన్స్ హడావుడి, ఐపీఎల్ హంగామా బాక్సాఫీస్ వద్ద బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది.రివేంజ్ డ్రామా అయిన కూడా దర్శకుడు కథని కొత్తగా ప్రెజెంట్ చేసాడనే అభిప్రాయం వస్తోంది. ఇదే ఫీడ్ బ్యాక్ తో ప్రేక్షకాదరణ కొనసాగితే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని కృష్ణమ్మ ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంటుంది. పైగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వాయిదా పడటంతో ఈ సినిమాకి వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: