ఓటు వేసేటప్పుడు కరెంట్ పోతే.. ఈవీఎం పని చేస్తుందా?

praveen
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓటర్ల పండుగ జరుగుతుంది   అదేనండి ఎలక్షన్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉండగా.  కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇక దేశ వ్యాప్తంగా ఏ మూలన చూసిన కూడా ఎన్నికల హడావిడినే కనిపిస్తూ ఉంది. ఇక అన్ని పార్టీల అభ్యర్థులు అందరూ కూడా గెలుపే లక్ష్యం గా ముందుకు సాగుతున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయం పై స్పష్టమైన హామీలను ఇస్తున్నారు.

 ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకోవడానికి చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మరోవైపు ఓటర్లు  ఎవరికి ఓటు వేసి గెలిపించు కోవాలి అనే విషయంపై ఆలోచనలో పడి పోయి.. బిజీ బిజీగానే ఉన్నారు. అదే సమయం లో ఎన్నికల అధికారాలందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో పోస్టులు కూడా ప్రత్యక్షమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈవీఎంల ద్వారా ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమం లోనే ఈవీఎంల పని తీరుపై ఎంతో మందికి ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలా ఏవీఎం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారి పోయింది. ఒకవేళ ఓటు వేసే సమయంలో కరెంటు పోతే ఈవీఎం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పని చేస్తాయట. సాధారణ 7.5 ఓల్డ్ ఆల్కలైన్ పవర్ ఫ్యాక్టర్ తో ఇవి పనిచేస్తాయి అనేది తెలుస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు కరెంట్ పోయినా కూడా ఇలాంటి సమస్య రాదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: